పవన్ పీరియాడిక్ డ్రామా కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్స్
- February 13, 2020 / 01:11 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతోపాటు సినిమాల్లోనూ తన దూకుడు ప్రదర్శించడం మొదలెట్టిన విషయం తెలిసిందే. ఒకేసారి మూడు ప్రొజెక్ట్స్ సైన్ చేసి సంచలనం క్రియేట్ చేసిన పవర్ స్టార్.. ఒకే సమయంలో రెండు సినిమాలు షూట్ చేస్తూ ఇండస్ట్రీ పెద్దలనే కాక తన తోటి హీరోలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వరుసబెట్టి సినిమాలు చేస్తుండడంతో ఆయన పక్కన హీరోయిన్స్ ను ఫైనల్ చేయడం దర్శకులకు పెద్ద సమస్యాలా తయారయ్యింది.

లక్కీగా “పింక్” రీమేక్ లో పవన్ కు హీరోయిన్ లేదు కాబట్టి సరిపోయింది. క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు కథానాయికలు అవసరం. ఒక హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేసినప్పటికీ.. ఆమెకు బాలీవుడ్ నుండి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లిపోయింది. దాంతో ఇప్పుడు క్రిష్ బాలీవుడ్ హీరోయిన్ ను రంగంలోకి దింపే పనిలో పడ్డాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా జక్వాలిన్ ను ఎంపిక చేయాలని ఫీక్స్ అయ్యాడు క్రిష్. ఈమేరకు సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. అయితే.. ఆమె డేట్స్ కాస్త ఎడ్జస్ట్ అవ్వడం కష్టమయ్యే క్రమంలో మరో బాలీవుడ్ భామ దిశా పటానీని కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకర్ని వచ్చే నెల కల్లా ఫిక్స్ చేసి రెండో షెడ్యూల్ మొదలెట్టానున్నాడు క్రిష్.
Most Recommended Video
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

















