పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ వచ్చే నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా ఈ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 175 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. వినోదాయ సిత్తం మూవీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. అయితే ఈ సినిమా బడ్జెట్ కేవలం 120 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు ఏకంగా 55 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలు వచ్చాయని బోగట్టా. పవన్ కళ్యాణ్ స్టామినా వల్లే నిర్మాతలకు ఈ రేంజ్ లో లాభాలు వచ్చాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్, సాయితేజ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ అయితే రానున్నాయని సమాచారం అందుతోంది. పవన్, సాయితేజ్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారని సమాచారం అందుతోంది. సముద్రఖని ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కానున్నారు. బ్రో సినిమా కథలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఎన్నో మార్పులు చేశారని తెలుస్తోంది.
బ్రో మూవీ (Bro Movie) స్టోరీలో ఎన్నో ట్విస్టులు ఉంటాయని బోగట్టా వరుస విజయాలతో జోరుమీదున్న పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పవన్ తర్వాత సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.