Pawan Kalyan: అక్కడ ట్రెండింగ్ లో పవన్ ఫ్లాప్ మూవీ సాంగ్.. అసలేమైందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)  కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి (Agnyaathavaasi) సినిమా ప్రేక్షకులను ఒకింత నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. ఈ సినిమాలోని గాలివాలుగా సాంగ్ అప్పట్లో ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు అనిరుధ్ (Anirudh Ravichander) మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. అయితే స్పాటిఫై యాప్ లో తాజాగా ఈ సాంగ్ ట్రెండింగ్ లో నిలవడంతో అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

Pawan Kalyan

అజ్ఞాతవాసి విడుదలైన ఆరేళ్ల తర్వాత కూడా ఈ రేంజ్ లో సంచలనాలు సృష్టించడం అంటే సాధారణ విషయం కాదు. పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ వల్లే ఈ అరుదైన రికార్డులు సాధ్యమవుతున్నాయని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది ఎన్ని సినిమాలను విడుదల చేస్తారో చూడాల్సి ఉంది. పవన్ త్వరలో షూటింగ్స్ లో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించి తన రేంజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో పవన్ సినిమాలపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేసి పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాలకు పరిమితం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మంచి పేరును సొంతం చేసుకుంటున్నారు. మంత్రిగా తన మార్క్ పాలనతో పవన్ ముందడుగులు వేస్తున్నారు.

పిల్లలపై ద్వేషాన్ని చూపించకండి.. అలేఖ్య కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus