పవన్ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” టీజర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ ని మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేశారు. చాలా కాలంగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ‘విరూపాక్ష’, ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉండగా.. తాజాగా ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ చిన్నపాటి టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో ముందుగా పవన్ డ్రెస్ కి ఉన్న గద్ద సింబల్ ని చూపిస్తూ.. మెల్లగా కత్తి.. అతడి చేతికి ఉన్న కడియంని చూపించారు. ఆ తరువాత అతడు పట్టిన ఆయుధాన్ని చూపిస్తూ.. పవన్ కళ్లను హైలైట్ చేస్తూ ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ ని కట్ చేశారు. గజదొంగ డ్రెస్ లో పవన్ షిప్ మీదకి ఎగిరే సన్నివేశం మొత్తానికి హైలైట్ గా నిలిచింది. కీరవాణి అందించిన నేపధ్య సంగీతం ఈ ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది.

ఈ వీడియో చూసిన తరువాత సినిమాపై అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ఇది పవన్ అభిమానులకు మంచి ట్రీట్ అనే చెప్పాలి. ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ నే ఈ రేంజ్ లో చూపించారంటే ఇక టీజర్, ట్రైలర్ సమయంలో హడావిడి మాములుగా ఉండదని అనిపిస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో ముఖ్య పాత్రలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కనిపించనుందని సమాచారం.


శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus