Pawan Kalyan: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ – సుజిత్ సినిమా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే తన ప్రచార రథం వారాహి వాహనానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పూజలు జరిపించిన సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. కాకపోతే మరికొద్ది రోజుల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోలో సందడి చెయ్యబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

పవన్, ‘సాహో’ సుజిత్ దర్శకత్వంలో.. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్రెస్టీజియస్ ఫిలిం ప్రొడ్యూస్ చేసిన డివివి దానయ్య నిర్మాణంలో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం (జనవరి 30)న సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. పవర్ స్టార్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫుల్ బ్లాక్ ఔట్ ఫిట్, సరికొత్త హెయిర్ స్టైల్‌తో ఉన్న పవన్ న్యూ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్, సురేష్ బాబు, ఎ.ఎమ్.రత్నం, కె.ఎల్.నారాయణ, బీవీఎస్ఎన్ ప్రసాద్, ఎస్.ఎస్.కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఈ సినిమా ప్రకటించినప్పటినుండే ఆసక్తి నెలకొంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచేశారు టీం. ‘ఓజి’ అనే పేరు ఫిక్స్ చేశారు. ‘ఓజి’ అనేది అమెరికా పదమని, దాని అర్థం ఒరిజనల్ గ్యాంగ్‌స్టర్ అని తెలుస్తుంది. జపనీస్ భాషలో ‘ఫైర్ స్ట్రోమ్ కమింగ్’ ( అగ్ని తుఫాను వస్తుంది) అనే సాలిడ్ ట్యాగ్‌లైన్ కూడా పెట్టారు. ‘సాహో’ తర్వాత సుజిత్ మరే సినిమాకు దర్శకత్వం వహించలేదు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ ఫిలిం ‘హరి హర వీరమల్లు’ చేస్తున్నారు. ఇంకా 40 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. దసరాకు విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. అలాగే హరీాష్ శంకర్, మైత్రీ మూవీస్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేయనున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితోనూ ఓ చిత్రం చేయాల్సి ఉంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus