Pawan Kalyan: పవన్‌ – సుజీత్‌ సినిమా విషయంలో కీలక నిర్ణయం.. అదే జరిగితే!

  • February 1, 2023 / 12:54 PM IST

ఒక డై హార్డ్‌ ఫ్యాన్‌ తన అభిమన హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో.. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలు చూస్తే చెప్పేయొచ్చు. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ అలా వచ్చి అఖండ విజయం సాధించివే. దీంతో నెక్స్ట్‌ హీరో – ఫ్యాన్ కాంబినేషన్‌పై అంచనాలు మొదలయ్యాయి. ఇటీవల మొదలైన ఆ సినిమా గురించి ఆసక్తికర అంశాలు కూడా బయటికొచ్చాయి. ఒకవేళ అదే జరిగితే మాత్రం.. పవన్‌ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ఫీస్ట్‌ అని చెప్పాలి. అదేంటి అనుకుంటున్నారా? మేం చెప్పేది సుజీత్‌ సినిమా గురించి కాబట్టి.

‘సాహో’ సినిమా భారీ సినిమాలు తీయడానికి మన దగ్గర కూడా ఓ కుర్రాడు ఉన్నాడు అని నిరూపించుకున్నారు సుజీత్‌. అంతకుమందు ‘రన్‌ రాజా రన్‌’ తీసినా.. ‘సాహో’తో పాన్‌ ఇండియా ఎంట్రీ ఇచ్చారు. చాలా రోజుల గ్యాప్‌ తీసుకొని ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తో ‘OG’ (వర్కింగ్ టైటిల్‌) అనే సినిమా చేస్తున్నారు. ఇటీవల ముహూర్తం జరుపుకున్న ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా జరిగిపోయాయి అంటున్నారు.

డీవీవీ దానయ్య చాలా రోజుల తర్వాత పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా కుటుంబం మీద ఆయనకున్న అభిమానం గురించి ఫ్యాన్స్‌కి బాగా తెలుసు. ఈ క్రమంలో పవన్‌తో సుజీత్‌ సినిమా అందులోనూ రెండు పార్టులు అనేసరికి అంచనాలు డబుల్‌ అవుతున్నాయి. దీనికి తగ్గట్టు ఫస్ట్‌ పార్టు క్లైమాక్స్‌ కూడా రాసుకున్నారట. తొలి పార్ట్‌ను ఈ ఏడాది దసరాకు రిలీజ్‌ చేస్తారట. ఆ తర్వాత రెండో పార్టు షూటింగ్‌ ప్రారంభిస్తారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా అనుకుంటున్నట్లు ముందుకెళ్తుందో, లేక హరీశ్‌ శంకర్‌ సినిమా ముందుకెళ్తుందో చూడాలి. ఎందుకంటే మూడు సినిమాలను ఒకేసారి షూటింగ్‌కి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ‘హరి హర వీరమల్లు’ అయ్యాకనే మిగిలిన సినిమాలన్నీ స్టార్ట్‌ చేసే ఆలోచనలో పవన్‌ ఉన్నారని అంటున్నారు. సో సినిమాల రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలయ్యేంతవరకు ఏమీ చెప్పలేం.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus