Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి సినిమాకి ఎంత తీసుకున్నాడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గురించి అతని డిమాండ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘మిగిలిన హీరోలు హిట్లు కొట్టాలి అంటే స్టార్ డైరెక్టర్లు.. స్టార్ ప్రొడ్యూసర్లు కావాలేమో. ఇతనికి మాత్రం అంత అవసరం లేదు’… అంటూ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. ఆ కామెంట్స్ లో నిజం ఎంత అనే విషయాన్ని పక్కన పెడితే.. హిట్, ప్లాప్.. అనే రిజల్ట్ తో పవన్ క్రేజ్ కు సంబంధం ఉండదు అనే విషయం దాదాపు 10 ఏళ్ళ పాటు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలి అంటే అక్షరాలా 50 కోట్ల పారితోషికం అతనికి ఇవ్వాల్సిందే.

అయినప్పటికీ ఎంతో మంది నిర్మాతలు ఎగబడుతుంటారు. అడ్వాన్స్ ను ముందుగానే ఇచ్చేసి ఎన్నేళ్ళు అయినా ఎదురుచూస్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభించిన రోజుల్లో.. ముఖ్యంగా తన మొదటి సినిమాకి ఎంత పారితోషికం తీసుకుని ఉంటాడు అనే డౌట్ అందరిలోనూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ను లాంచ్ చేసే బాధ్యతని .. అల్లు అరవింద్ కు అప్పగించారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ అనే చిత్రాన్ని.. నిర్మాత అల్లు అరవింద్ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణతో తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు తగినట్టు మార్పులు చేయించి తీశారు.

ఓ స్టార్ హీరోకి ఎంత బడ్జెట్ పెడతారో పవన్ సినిమకి అంత బడ్జెట్ పెట్టారు. టాలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ మొత్తం ఈ సినిమాలో ఉంటారు. స్టార్ హీరోయిన్ రంభతో ఐటెం సాంగ్.. ఇక అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ హీరోయిన్. ఇలా భారీగానే ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నెలకు 5 వేలు చొప్పున ఇచ్చాడట నిర్మాత అల్లు అరవింద్. మొత్తం కలిపి 50 వేలు లోపే ఉంటుందట. సినిమా యావరేజ్ గానే ఆడినా పవన్ కళ్యాణ్ కు రావాల్సిన గుర్తింపు అయితే వచ్చింది. ఇప్పుడు 50 కోట్లు పారితోషికం తీసుకునే రేంజ్ కు ఎదిగాడు.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
తన 19 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus