Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కి ఫుల్‌ మజా న్యూస్‌.. నిజమైతే పండగే!

పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కి ఇప్పటికిప్పుడు గుడ్‌ న్యూస్‌, హ్యాపీ న్యూస్‌ ఏదైనా ఉందా అంటే.. ఆయన నటిస్తున్న సినిమాల రిలీజ్‌ డేట్సే. ఎందుకంటే పవన్‌ కల్యాణ్ సినిమాలు ప్రస్తుతం సెట్స్‌ మీద నాలుగు ఉన్నాయి. అందులో ఓ సినిమా రిలీజ్‌ డేట్‌ మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా మూడు సినిమాల సంగతి తేలాల్సి ఉంది. అందులో ఓ సినిమా గురించి పెద్దగా ఆలోచించడం లేదు కానీ.. రెండు సినిమాల గురించి అయితే గట్టిగా ఆలోచిస్తున్నారు. అందులో ఒక సినిమా గురించే ఇప్పుడు చెబుతున్నాం.

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ‘బ్రో’ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అందులో పవన్‌ ఫ్యాన్స్‌ను బాగా ఎగ్జైట్‌ చేస్తున్న సినిమా ‘ఓజీ’. పవన్‌ కల్యాణ్‌ లుక్‌, సినిమా ప్లాటే దీనికి కారణం. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో పవన్‌ ఫ్యాన్‌ అయిన సుజీత్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఎందుకంటే ‘బ్రో’ సినిమా తర్వాత ఈ సినిమానే రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట.

‘ఓజీ’ సినిమా కోసం (Pawan Kalyan) పవన్ కల్యాణ్ పక్కా ప్లాన్ ప్రిపేర్ చేశారని టాక్‌. ఈ ఏడాది అక్టోబర్‌లోగా సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తానని చెప్పారట. దీనికి తగ్గట్టుగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోమని చెప్పేశారట. అంటే ‘ఓజీ’ చిత్రీకరణ అక్టోబర్‌కు పూర్తి అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే అని అనాలి. అక్టోబరులో సినిమా పూర్తయితే రెండు నెలల్లో సినిమా రిలీజ్‌ చేసేయొచ్చు అని చెబుతున్నారు. అలా సినిమా ఎర్లీగా రావడం ఫ్యాన్స్‌కి పండగే కదా.

ఇప్పటివరకు ఉన్న సమాచారం, అనౌన్స్‌మెంట్ల ప్రకారం ‘బ్రో’ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత వచ్చే సినిమా ‘ఓజీ’నే అంటున్నారు. ఇక హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక ‘హరి హర వీరమల్లు’ సంగతి మనకు తెలియదు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus