‘వకీల్ సాబ్’ వచ్చేది అప్పుడేనా..?

ఇప్పుడున్న లాక్ డౌన్ పరిస్ధితి ఎప్పటికి చక్క పడుతుందో ఎవ్వరికీ తెలీదు.మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. తెలంగాణ లో మాత్రం మే 7 వరకూ లాక్ డౌన్ కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రకటించారు. నిజానికి అప్పటికైనా లాక్ డౌన్ ఎత్తేస్తారా అంటే కచ్చితంగా చెప్పలేము. జూన్ నెల ఆఖరి వరకూ లాక్ డౌన్ ఎత్తే సమస్య లేదని కొందరు చెబుతున్న మాట. ఇందులో ఎంత వరకూ నిజముందో తెలీదు కానీ… థియేటర్ల విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ రావడం లేదు.

జూలై లో థియేటర్ లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. అంటున్నారు కానీ ప్రేక్షకులు థియేటర్ లకు వస్తారు అని గ్యారంటీ లేదు. ఆగష్టు నుండీ కొంత మేరకదిలి వస్తారు. కాబట్టి దిల్ రాజు తన ‘వి’ చిత్రాన్ని ఆగష్టు 15 న విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఆయన మే 15 విడుదల చెయ్యాలి అనుకున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని దసరా కానుకగానే విడుదల చెయ్యాలి అనుకుంటున్నట్టు సమాచారం.

Pawan Kalyan's Vakeel Saab Movie First Look Talk1

పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆయన అభిమానులు అలాగే తెలుగు ప్రేక్షకులు అంతా ఎంతో ఆశక్తితో ఎదురుచూస్తున్నారు. ‘పింక్’ రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండీ ‘మగువా’ అనే ఫస్ట్ సింగిల్ కు ఇప్పటికే మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇక పవన్ సరసన శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus