Pawan Kalyan : పుష్ప వైరల్‌ పిక్‌ నిజమైతే… ఇక పూనకాలే

‘పుష్ప’ సినిమాకు సంబంధించి ఫొటోలు, వీడియోలు చాలా లీక్‌ అవుతున్నాయి. చిత్రబృందం ఎంత చెప్పినా, వార్నింగ్‌లు ఇచ్చినా ఎవరూ వినడం లేదు. క్రియేటివిటీ చూపించి మరీ సినిమాకు సంబంధించిన సమాచారాన్ని లీక్‌ చేసేస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన ఓ లీక్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు పండగలా అనిపిస్తోంది. పనిలోపనిగా అల్లు అర్జున్‌ – బన్నీ ఫ్యాన్స్‌ కూడా సంబరపడిపోతున్నారు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ ఓ లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడనే విషయం తెలిసిందే.

ఇప్పటివరకు వచ్చిన లుక్స్‌, వీడియోల్లో అదే కనిపించింది కూడా. తాజాగా సినిమా సెట్‌లో ఆ లారీ ఉన్న ఫొటో కొటి బయటికొచ్చింది. ఆ లారీ ఎదురు అద్దం మీద పవన్‌ కల్యాణ్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో కనిపిస్తోంది. సాధారణంగా చాలా లారీలకు ఇలాంటి ఫొటోలు కనిపిస్తాయి. అయితే బన్నీ నడిపే లారీ మీద ఈ ఫొటో ఉండటం ఇక్కడ ఆసక్తికరం. పవన్‌ కల్యాణ్‌, బన్నీ మధ్య పొరపచ్చాలు ఉన్నాయంటూ చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి.

అప్పుడెప్పుడో ఓ ఈవెంట్‌లో బన్నీ అన్నమాట పట్టుకొని లాగి లాగి పీకేస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఓ సందర్భంలో కలసి మాట్లాడుకున్నారు. అయినా ఇంకా ఆ చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బన్నీ లారీ మీద పవన్‌ ఫొటో పెట్టి వాటికి చెక్‌ చెప్పాలని చూస్తున్నారా? లేక అనుకోకుండా అలా జరిగిందా? అనేది తెలియాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus