సినీ పరిశ్రమలో ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. దర్శకులు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి, లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా వంటి వారు మరణించారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ కన్నుమూశారు. ఆయన వయసు 68 ఏళ్ళు కావడం గమనార్హం. ఆయన మరణవార్త కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. విమల్ కుమార్ రాజ్ పుత్ జూలై 28నే మరణించారట. హైదరాబాద్‌లో పాయల్ నివసిస్తున్న ఇంట్లోనే ఆమె మరణించినట్టు తెలుస్తుంది. అయితే అంత్యక్రియలు ఈరోజు అనగా జూలై 30న విమల్ కుమార్ స్వస్థలం అయినటువంటి ఢిల్లీలో నిర్వహించనున్నారు అని సమాచారం. తండ్రి మరణం పై పాయల్.. ” మీరు నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు తోడుంటాయి. మీరు ఈ లోకం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయంలో మీ స్థానం అలానే ఉంటుంది. లవ్ యు నాన్న” అంటూ ఎమోషనల్ గా స్పందించింది.
‘RX 100’ సినిమాతో టాప్ హీరోయిన్ గా ఎదిగిన పాయల్ రాజ్ పుత్.. ఆ తర్వాత ‘ఆర్ డి ఎక్స్ లవ్’ ‘డిస్కో రాజా’ ‘వెంకీ మామ’ ‘జిన్నా’ ‘మంగళవారం’ ‘రక్షణ’ వంటి చిత్రాల్లో నటించింది.