ఇండస్ట్రీలో అమ్మాయిలకు సేఫ్టీ లేదు అనే మాటలో నిజమెంత, అబద్ధమెంత అనే చర్చ ఎప్పుడు ఫిల్మ్ నగర్ లో జరుగుతూనే ఉంది. తమకు సేఫ్టీ లేదు అని కొందరు చెబితే.. తాము సేఫ్ గా ఉన్నాం, ఇండస్ట్రీలో అలాంటి సమస్యలేమీ లేవు అని చెప్పుకొనేవారూ లేకపోలేరు. అయితే.. 80% హీరోయిన్స్, క్యారెక్టర్స్ ఆర్టిస్ట్స్ “క్యాస్టింగ్ కౌచ్”కి లొంగినవారే అనే వాదనకు ఆజ్యం పోస్తూ అప్పుడప్పుడూ కొందరు హీరోయిన్లు బయటపడుతుంటారు.
కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు సింగర్స్ కూడా ఆ తరహా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని గతంలో కొందరు సింగర్లు పబ్లిక్ గా చెప్పారు. అయితే.. సింగర్స్ కే కాదు లిరిసిస్ట్ లకూ “ఆ బాధలు” తప్పలేదు అంటున్నారు శ్రేష్ట. “ఒక రోమాంటిక్ క్రైమ్ కథ” సినిమాతో లిరిసిస్ట్ గా పరిచయమైన శ్రేష్ట.. తర్వాత కొందరు ఫేమస్ లిరిసిస్ట్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను అవకాశాల కోసం సంప్రదించగా.. వారు “తమకేంటి” అని అడిగేవారట. దాంతో మొదట్లో కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినా.. తర్వాతి కాలంలో మాత్రం కాస్త గట్టిగానే సమాధానం చెప్పడం మొదలెట్టింది శ్రేష్ట. తాజాగా “అర్జున్ రెడ్డి”లోనూ ఒక పాట రాసి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొంది. ఈమెను ఆదర్శంగా తీసుకొని ఇంకొందరు ఎలాంటి పక్కదోవలు పట్టకుండా పైకి ఎదగాలని కోరుకుందాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.