హిందీలో రీమేక్ కానున్న పెళ్లి చూపులు!
- October 13, 2016 / 01:51 PM ISTByFilmy Focus
చిన్న చిత్రంగా రిలీజ్ అయి పెద్ద హిట్ అందుకున్న మూవీ పెళ్లి చూపులు. విజయ్ దేవర కొండ, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా ఒకటిన్నర కోట్లతో నిర్మితమైన ఈ ఫిల్మ్ జులై 29 న విడుదలై ఘన విజయం సాధించింది. నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఎరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే 30 కోట్లు వసూల్ చేసి రికార్డు సృష్టించింది.
విదేశాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో బాలీవుడ్ సినీ వర్గాల వారు ఈ చిత్రంపై కన్ను వేశారు. రీమేక్ హక్కుల కోసం ఎగ బడ్డారు. అమితాబ్ బచ్చన్ వంటి హీరోలతో చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత వషు భగ్నానీ భారీ మొత్తానికి పెళ్లి చూపులు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. హిందీ వెర్షన్ కి కూడా తరుణ్ భాస్కర్ డైరక్ట్ చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయాలను 100 రోజుల పండుగ నాడు అధికారికంగా చిత్ర బృందం వెల్లడించనుంది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















