నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది ‘జెర్సీ’ తో మంచి హిట్టందుకున్నాడు. ఇక ‘జెర్సీ’ తరువాత నాని నుండే వచ్చిన చిత్రం ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. సెప్టెంబర్ 12 న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. మొదటి మూడు రోజులు కలెక్షన్లు అదిరిపోయాయి. అయితే అనూహ్యంగా మొదటి సోమవారం నుండీ కలెక్షన్లు డౌన్ అయిపోయాయి. ఆ తరువాత పరిస్థితి ఇంకా ఘోరం. ఈ చిత్రాన్ని 28 కోట్లకు అమ్మితే.. ఫైనల్ గా 21 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్లాప్ గా మిగిలిపోయింది.
అసలు ఎందుకు ఈ చిత్రం కలెక్షన్లు పడిపోయి.. ప్లాప్ లిస్ట్ లో చేరింది? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. సినిమా అంతా బాగానే ఉంది. నానికి, దర్శకుడు విక్రమ్ కుమార్ కు ఓ రేంజ్ క్రేజ్ ఉంది. అయినా జనాలు థియేటర్ కు రాలేదు. అయితే ప్రమోషన్ల విషయంలో నిర్మాతలు సహకరించలేదని కూడా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు… కెరీర్ ప్రారంభంలో ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘రంగస్థలం’ వంటి వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. అయితే తరువాత నుండీ వీరు కూడా ప్లాపుల బాట పట్టారు. వీళ్ళు నిర్మించే చిన్న సినిమాలని పెద్దగా పట్టించుకోరని.. వాటికి సరిగ్గా ప్రమోషన్లు చేయరనే టాక్ ఎప్పటినుండో ఉంది. ‘ఈ ఏడాది వచ్చిన ‘చిత్రలహరి’ చిత్రానికి కూడా వీరు సరిగ్గా ప్రమోషన్లు చేయలేదు. కానీ ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి మాత్రం ఓ రేంజ్లో ప్రమోషన్లు చేశారు. ఆ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ.. కొన్ని ట్రిమ్మింగ్ లు చేసి కొత్త వెర్షన్ అంటూ ప్రమోషన్లు చేశారు. కానీ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ను మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో హీరో నాని కూడా అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తుంది.
‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?