హీరోయిన్ తమన్నా మరియు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పై ఓ ప్రముఖ లాయర్ కేసు వేశారు. జూదాన్ని ప్రోత్సహించే యాప్స్ కి ప్రచార కర్తలుగా ఉన్న తమన్నా, కోహ్లీ యువతను పెడదారి పట్టిస్తున్నారని, కాబట్టి ఈ ఇద్దరు సెలెబ్రిటీలను అరెస్ట్ చేయాలని చెన్నైకి చెందిన ఓ ప్రముఖ లాయర్ చెన్నై హై కోర్ట్ లో పిటీషన్ వేశారు. సెలెబ్రిటీ హోదాలో ఉంది సామాజిక బాధ్యత లేకుండా వీరు ప్రవర్తిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వీరి ప్రచారం వలన వీరిని స్ఫూర్తిగా తీసుకొనే యువత జూదానికి అలవాటు పడే అవకాశం కలదని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. చెన్నై హై కోర్టులో ఆయన రిట్ పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ పిటీషన్ పై కోర్ట్ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. నలుగురిని ప్రభావితం చేసే స్థానంలో ఉండి ఇలాంటి వ్యసన పూరిత విషయాలకు ప్రచార కర్తలుగా ఉండడం అనేది నిజంగా ఖండించ దగ్గ విషయమే.
కాసుల కక్కుర్తితో కొందరు అసలు ఇవేమి పట్టించుకోకుండా అనేక అభ్యంతరకర ఉత్పత్తులకు ప్రచార కర్తలుగా ఉంటున్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం మద్యం, పొగాకు ఉత్పత్తుల ప్రచారంకు బ్రేక్ వేసింది. కాగా ఈ మధ్య ఆన్లైన్ రమ్మీ అనేది పెద్ద వ్యసనంగా మారింది. అనేక ఆన్లైన్ రమ్మీ యాప్ లో ప్రాచుర్యంలో ఉండగా, కొందరు ప్రముఖులు వీటికి ప్రచార కర్తలుగా ఉంటున్నారు. కన్నడ స్టార్ హీరో సుధీప్ సైతం ఓ ఆన్లైన్ రమ్మీ యాప్ కి ప్రచార కర్తగా ఉన్నారు.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?