c ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ నుండి వచ్చిన ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా శ్రీనివాస్ అవసరాల ఓ కీలక పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు. టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ ఈ చిత్రాన్ని నిర్మించగా.. సహ నిర్మాతగా వివేక్ కూచిభొట్ల వ్యవహరించారు.
నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘ఊహలు గుసగుస లాడే’, ‘జో అచ్యుతానంద’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ చిత్రం పై ఓ వర్గం ప్రేక్షకుల దృష్టి పడింది.దీంతో బిజినెస్ ఓ మాదిరిగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
2.20 cr
సీడెడ్
1.00 cr
ఉత్తరాంధ్ర
0.50 cr
ఈస్ట్
0.26 cr
వెస్ట్
0.20 cr
గుంటూరు
0.28 cr
కృష్ణా
0.32 cr
నెల్లూరు
0.18 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
5.14 cr (షేర్)
‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ చిత్రానికి రూ.5.14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నాగ శౌర్య నటించిన గత చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రం రూ.4.7 కోట్ల షేర్ ను రాబట్టింది. మరి ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.