ఓటీటీ హవా పెరిగిపోవడంతో థియేటర్లలో సినిమా చూసే వారి సంఖ్య తగ్గింది. అదే సమయంలో పైరసీ సైట్స్ ప్రమాదం కూడా ఏమాత్రం తగ్గలేదు. కొత్త సినిమాలు విడుదలైన మొదటిరోజే హెచ్ డీ ప్రింట్స్ పైరసీ సైట్స్ లో అందుబాటులోకి వస్తున్నాయి. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలకే పైరసీ ముప్పు ఎక్కువైంది. ఇప్పుడు ఈ పైరసీ ఎఫెక్ట్ దిల్ రాజు సినిమాకి కూడా తగిలింది. రీసెంట్ గా తమిళంలో విడుదలై భారీ విజయం అందుకున్న ‘లవ్ టుడే’ సినిమాను దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేశారు.
గతవారం విడుదలైన తెలుగు వెర్షన్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. వీకెండ్ కి ‘లవ్ టుడే’ మంచి కలెక్షన్స్ రాబట్టినా.. సోమవారం నుంచి కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తోంది. దానికి కారణం పైరసీ సైట్స్ అనే చెప్పాలి. మూవీ రూల్స్ లో ‘లవ్ టుడే’ తమిళ వెర్షన్ హెచ్ డీ ప్రింట్ ఎప్పటినుంచో ఎవైలబుల్ గా ఉంది. ఇప్పుడు తెలుగు ప్రింట్ కూడా దించేశారు. కొన్ని వెబ్ సైట్స్ లో హెచ్ డీ ప్రింట్ కూడా ఉంది.
దీంతో చాలా మంది ఈ సినిమాను డౌన్ లోడ్ చేసుకొని చూస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ అవుతుందని దిల్ రాజు నమ్మారు. అందుకే తమిళ్ లో విడుదలైన కొన్ని రోజులకే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. దిల్ రాజు ఆశించినట్లుగానే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక్కడ కనీసం రూ.20 కోట్ల కలెక్షన్స్ వస్తాయని అంచనా వేశారు.
కానీ పైరసీ ఎఫెక్ట్ వలన సినిమా ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతుంది. వీక్ డేస్ సినిమా నిలబడలేకపోతే ఇక భారీ లాభాలు రావడం కష్టమే. ఈ సినిమా కోసం దిల్ రాజు పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. ఒక చిన్న ప్రీరిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్ నిర్వహించి ఊరుకున్నారు. సరైన ప్రమోషన్స్ చేసి ఉంటే బహుశా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడానికి హెల్ప్ అయ్యేది.