Thank You Movie: ‘థాంక్యూ’ కి నెగిటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవేనా?

  • July 23, 2022 / 11:56 AM IST

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన మూవీ ‘థాంక్యూ’. నాగ చైతన్య, విక్రమ్ కుమార్ అనగానే ప్రామిసింగ్ కాంబినేషన్ అని అంతా భావిస్తారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘మనం’ వంటి క్లాసిక్ మూవీ కోసం పనిచేశారు. ఆ చిత్రం జనాలను ఎంతలా ఎంటర్టైన్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి వీరి కాంబినేషన్లో ‘థాంక్యూ’ అనే మూవీ వస్తుంది అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి.

కానీ ‘థాంక్యూ’ మూవీ పై అంతగా అంచనాలు ఏర్పడలేదు.రిలీజ్ అయ్యాక టాక్ అయితే బాగా వస్తుందేమో అని కొంతమంది భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈరోజు రిలీజ్ అయిన ‘థాంక్యూ’ మూవీకి నెగిటివ్ వస్తుంది. దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన ఈ మూవీ ఎందుకు నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.అలా అని ఇది తీసిపారేసే మూవీ అయితే కాదు. కానీ నెగిటివ్ టాక్ రావడానికి కారణం ఏంటి అనే విషయాలను ఓసారి పరిశీలిస్తే :

ముందుగా ‘థాంక్యూ’ సినిమాకి ఉన్న ప్లస్సులు :

1) ‘థాంక్యూ’ కథ చాలా ఎథికల్ గా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరూ అసాధ్యమనుకున్న దాన్ని సాధించిన తర్వాత.. ‘మేము తోపులం’ అని అనుకుంటారు. కానీ అంతటి గొప్ప పొజిషన్ కు చేరుకోవడానికి కూడా ఎంతో మంది కారణం అవుతారు. ఒక చిన్న మాట కూడా.. ఒక్కోసారి మనకి పెద్ద సాయం చేసుంటుంది.కానీ ఆ మాట చెప్పిన వారిని మనం బహుశా మర్చిపోవచ్చు. బిజీ లైఫ్ లో మర్చిపోవడం సహజమే కదా. అలాంటి వారిని కలిసి ‘థాంక్స్’ చెబితే మనం సాధించిన సక్సెస్ కు ఓ విలువ ఉంటుంది అనేది ఈ చిత్రం కాన్సెప్ట్.

2) సినిమాలో నాగ చైతన్య చాలా బాగా నటించాడు. మూడు విభిన్న పాత్రల్లో చైతన్య కనపరిచిన నటన అద్భుతంగా ఉంది. సినిమా సినిమాకి అతను నటుడిగా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాడు. అభిరామ్ పాత్రకు అతను పర్ఫెక్ట్ అనిపిస్తాడు.

3) మహేష్ బాబు అభిమానిగా నాగ చైతన్య కనిపించే సన్నివేశాలు అతని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

4)మాళవిక నాయర్ లవ్ ట్రాక్ బాగుంది, రాశీ ఖన్నా లుక్స్ బాగున్నాయి.

5) నాగ చైతన్య – రాశీ ఖన్నా ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

6) పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

7) సినిమా నిడివి చాలా 2 గంటల 9 నిమిషాలు మాత్రమే ఉండడం.

ఇక మైనస్ ల సంగతి చూద్దాం :

8) ఈ కథకి సరైన దర్శకుడిని ఎంపిక చేసుకున్నారు కానీ సరైన కథనాన్ని డిజైన్ చేసుకోలేకపోయారు.

9) దర్శకుడు విక్రమ్ కుమార్ నుండి ఇలాంటి నాసిరకం, హడావిడి టేకింగ్ కలిగిన సినిమాని అయితే ఊహించలేము. ‘నేను స్క్రిప్ట్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను’ అని నిర్మాత దిల్ రాజు చెప్పారు కాబట్టి విక్రమ్ కుమార్ ను తప్పుపట్టడం పెద్ద తప్పు అవుతుంది.

10) అన్నీ ఎలా ఉన్నా… తమన్ ఈ చిత్రానికి పెద్ద బిస్కెట్ వేసాడు అని చెప్పాలి. పాటలు, నేపధ్య సంగీతం ఇలా ఎందులోనూ కూడా అతను ఆకట్టుకోలేకపోయాడు.

11) ఇది విక్రమ్ కుమార్ కథే అయితే.. అందులో కూడా చైతన్యనే హీరో అయితే.. ఎటువంటి ఒత్తిడి చేయని నిర్మాత ఉంటే ‘థాంక్యూ’ కథనం వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు ‘విక్రమ్ కుమార్’ క్రియేటివిటీని కూడా అనుమానించాల్సి వస్తుంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus