Sita Ramam Movie: ‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

  • August 5, 2022 / 06:14 PM IST

దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సీతా రామం’. రష్మిక మందన, సుమంత్, తరుణ్ భాస్కర్, గౌతమ్ మీనన్, భూమిక, ప్రకాష్ రాజ్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన మూవీ ఇది. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈరోజు(ఆగస్టు 5న) విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కి ప్లస్సులు ఏంటి?, మైనస్సులు ఏంటి?.. అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా ప్లస్సులు :

1) దర్శకుడు హను రాఘవపూడి తన మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ నుండి మొన్నొచ్చిన ‘పడి పడి లేచె మనసు’ సినిమా వరకు భావుకత్వంతో నిండిన ప్రేమ కథలనే తెరకెక్కిస్తూ వచ్చాడు. ‘సీతా రామం’ కూడా అంతే. ఈ సినిమా పై మంచి హైప్ ఏర్పడడానికి ప్రధాన కారణం కూడా అదే..!

2) దుల్కర్ సల్మాన్ లెఫ్ట్ నెంట్ రామ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇలాంటి పాత్రలు అతను మాత్రమే చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ చిత్రంతో తెలుగులో అతని మార్కెట్ మరింతగా బలపడుతుంది అని చెప్పొచ్చు.

3) మృణాల్ ఠాకూర్ సీత పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యింది. యువరాణి పాత్రకు తగ్గట్టు హుందాతనం లేదా దర్జా కూడా ఈమెలో పుష్కలంగా ఉన్నాయి. ఈమె కళ్ళను కెమెరా మెన్ చూపించిన విధానం చాలా బాగుంది. ఈమె బాలీవుడ్లో చాలా సినిమాల్లో నటించింది కానీ.. టిల్ డేట్ వరకు ఆమె పోషించిన పాత్రల్లో ది బెస్ట్ పాత్ర ఇదే అని చెప్పొచ్చు. ఈమె లుక్స్ కూడా చాలా బాగున్నాయి.టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఉంది అనేది వాస్తవమే. ఆ లోటుని తీర్చడానికి మృణాల్ టాలీవుడ్లో అడుగుపెట్టినట్టు ఉంది.భవిష్యత్తులో పెద్ద సినిమాల్లో ఈమెను ఎక్కువగా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

4) ‘సీతా రామం’ కథ విన్నప్పుడు కానీ లేదా టీజర్ వంటివి చూసినప్పుడు కానీ.. ఎక్కడో ఒక చోట మనకు ‘కంచె’ వంటి చిత్రాలు గుర్తుకొస్తాయి. కానీ ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలు గుర్తుకు రాకుండా చాలా అందంగా, ఆహ్లాదకరంగా కథాన్ని నడిపించాడు హను. భారీ బ్లాక్ బస్టర్లు ఈయన ఇప్పటివరకు ఇవ్వలేదు అని చాలామంది అంటున్నారు. కానీ ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి కథని హను రాఘవపూడి తప్ప ఎవ్వరూ హ్యాండిల్ చేయలేరు అనడంలో కూడా అతిశయోక్తి లేదు.ఈయన సినిమాల్లోని సంభాషణలు కూడా.. సినిమా చూసేసి మనం ఇంటికి వెళ్లేప్పుడు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ‘సీతా రామం’ లో కూడా అలాంటి సంభాషణలు ఎన్నో ఉన్నాయి.

5) నిర్మాతలు అశ్వినీదత్, స్వప్న దత్ లు ఈ సినిమాని ఎంతో పాషన్ తో నిర్మించారు. కథని, దర్శకుడిని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ‘వైజయంతి మూవీస్’ కాకుండా ఈ మూవీ ఇంత అందంగా తెరకెక్కడం అసాధ్యమనే చెప్పాలి.

6) సంగీతం.. గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి అందించిన సంగీతం టాప్ ఆర్డర్ లో ఉంటుంది. పాటలు వినడానికి, చూడటానికి కూడా చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.

7) పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ అని చెప్పాలి. నిర్మాత రూ.45 కోట్ల బడ్జెట్ పెడితే మనకు రూ.100 కోట్లు పెట్టాడేమో అనేంత గొప్పగా అనిపించాయి విజువల్స్. వినోద్ కెరీర్లో కూడా ఇది బెస్ట్ వర్క్ అనిపిస్తుంది.

8) సుమంత్ బ్రిగేడియర్ విష్ణు శర్మ గా చాలా బాగా నటించాడు.జెలసీ,కోపం, పశ్చాతాపంతో కూడుకున్న పాత్ర ఇది. ఇంతకు మించి ఈయన పాత్ర గురించి చెబితే మెయిన్ పాయింట్ లీక్ చేసినట్లు అవుతుంది.ఓ రకంగా అతనికి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చు. సుమంత్ ఇక నుండి ఇలాంటి పాత్రలు చేస్తే పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ లిస్ట్ లో చేరే అవకాశం ఉంది. రష్మిక మందన, తరుణ్ భాస్కర్ కూడా బాగా నటించారు.

ఇప్పుడు మైనస్సులు :

9) మాస్ ఆడియన్స్ కు వెంటనే కనెక్ట్ అయ్యే సినిమా అయితే కాదు. ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ అనిపిస్తుంది.

10) కంచె,మల్లీశ్వరి వంటి సినిమాల ఛాయలు కనిపించడం.

11) ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, భూమిక వంటి వారి పాత్రలకు పెద్దగా స్కోప్ లేకపోవడం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus