Jyothi Rana: ‘పోకిరి’ లో ప్రకాష్ రాజ్ లవర్.. ఇప్పుడెలా ఉందో చూడండి
- April 26, 2024 / 09:15 PM ISTByFilmy Focus
మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్ కి టర్నింగ్ పాయింట్ మూవీ అంటే ‘పోకిరి’ (Pokiri) అనే చెప్పాలి. అందులో ఎంత మాత్రం సందేహం అవసరం లేదు. ఆ సినిమా వల్లే మహేష్ కి సూపర్ స్టార్ ట్యాగ్ దక్కింది. అతని మార్కెట్ 2 ఇంతలు అయ్యింది. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్తగా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో ఇలియానా (Ileana D’Cruz) కూడా టాలీవుడ్ కి స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఆమె రేంజ్ ను కూడా అమాంతం పెంచేసిన మూవీ ఇది. మరోపక్క ఈ సినిమాలో లేడీ విలన్ గా.. అదే ప్రకాష్ రాజ్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ఆమె పలు బోల్డ్ సీన్స్ లో నటించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను డిస్టర్బ్ చేసే విధంగా ఆ సీన్స్ ఉంటాయనే ఈ చిత్రానికి సెన్సార్ వారు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ప్రకాష్ రాజ్ (Prakash Raj) గ్యాంగ్ లోకి పండుగాడిని(మహేష్) ని తెచ్చిపెట్టే అమ్మాయి కూడా ఈమెనే..!

ఆ రకంగా ‘పోకిరి’ లో ఈమె పాత్ర కూడా కీలకం అని చెప్పొచ్చు. సరే ఇంతకీ ఆ పాత్ర చేసిన అమ్మాయి పేరు ఏంటో తెలుసా? జ్యోతి రానా (Jyothi Rana) . ‘పోకిరి’ తర్వాత ‘దేవుడు చేసిన మనుషులు’ (Devudu Chesina Manushulu) ‘మెహబూబా’ వంటి సినిమాల్లో నటించింది. హిందీలో కూడా పలు బోల్డ్ వెబ్ సిరీస్లలో నటించింది. ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు రావడం లేదు. అన్నట్టు ఈమె మధ్యలో తన పేరును శివ రానాగా మార్చుకుంది.












