అల్లు అర్జున్ డాన్ అంటున్నారే..?

అల్లు అర్జున్-సుకుమార్ లది హిట్ కాంబినేషన్. సుకుమార్ కెరీర్ అల్లు అర్జున్ ఆర్య మూవీతో మొదలుకాగా, అల్లు అర్జున్ కి ఫస్ట్ హిట్ కూడా ఆ చిత్రంతోనే దక్కింది. బన్నీ మొదటి చిత్రం గంగోత్రిలో లుక్స్ మరియు యాక్టింగ్ విషయంలో విమర్శలకు గురికాగా రెండో చిత్రం ఆర్య లో తానేమిటో నిరూపించాడు. ఇక బన్నీ దాదాపు 11 ఏళ్ల తరువాత సుకుమార్ తో జతకట్టాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం ఆర్య 2, 2009లో విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

ఇక బన్నీ బాలీవుడ్ ఎంట్రీ కూడా సుకుమార్ మూవీతోనే ఇవ్వడం గమనార్హం. ఇక పుష్ప మూవీ కథపై అనేక ఉహాగానాలు ప్రచారంలో ఉండగా తాజాగా మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతుంది. బన్నీ ఈ చిత్రంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నారు. శేషాచలం అడవులలో జరిగే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ సుకుమార్ తెరకెక్కిస్తుండగా బన్నీ రోల్ లో టు షేడ్స్ ఉంటాయని వినిపిస్తుంది.

ఇక ఈ చిత్రంలో బన్నీ డాన్ కాగా ఓ సీక్రెట్ మిషన్ పై లారీ డ్రైవర్ వేషంలో వస్తాడట. పోకిరి సినిమాలో మాఫియాలో పనిచేసే మహేష్ ఐ పి ఎస్ ఆఫీసర్ గా ఎలా టర్న్ అవుతాడో అలాంటి భారీ ట్విస్ట్ పుష్మ మూవీ క్లైమాక్స్ లో చోటు చేసుకుంటుందని సమాచారం. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గాని టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. ఏదిఏమైనా పుష్ప అల్లు అర్జున్ కి మరో భారీ హిట్ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus