Pokiri Movie: పోకిరి రీ రిలీజ్ తో భారీ లాభాలు అందుకున్న నిర్మాతలు!

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి సినిమాని పలు థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు.కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యూఎస్ లో కూడా ఈ సినిమాని ప్రదర్శింపబడ్డారు.ఈ సినిమాతో పాటు కొన్నిచోట్ల ఆయన నటించిన మరో చిత్రం ఒక్కడు సినిమాని కూడా స్పెషల్ షో ప్రదర్శించబడ్డారు.

ఈ విధంగా మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాని 15 సంవత్సరాల తర్వాత తిరిగి విడుదల చేయడంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమాని చూడటం విశేషం.దాదాపు 15 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ సినిమా విడుదల కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివచ్చారు. ఇలా ఈ సినిమా స్పెషల్ షో ద్వారా భారీగా నిర్మాతలు లాభాలను పొందినట్లు తెలుస్తోంది.

అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే గంటల వ్యవధిలో బుకింగ్స్ క్లోజ్ అవ్వడంతోనే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది. పలు థియేటర్లలో స్పెషల్ షో ప్రదర్శించబడిన ఈ సినిమా నుంచి నిర్మాతలు సుమారుగా మూడు కోట్లకు పైగా లాభాలను అందుకున్నారని సమాచారం. ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని ఎవరూ కూడా ఊహించి ఉండరు.ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా ఒక్కడు సినిమా కూడా స్పెషల్ షో వేయడంతో ఒక్కడు చిత్ర బృందం కూడా హాజరయ్యి ఈ సినిమాని వీక్షించారు.

ఇకపోతే ఒక్కడు సినిమాకి కూడా భారీగానే టికెట్లు అమ్ముడుపోయాయని ఈ సినిమా ద్వారా సుమారు 60 లక్షలకు పైగా కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది.ఈ విధంగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ఆయన నటించిన సినిమాలను తిరిగి విడుదల చేయడం ద్వారా నిర్మాతలు నాలుగు కోట్ల రూపాయల వరకు ఆదాయం పొందారని సమాచారం. ఇకపోతే మహేష్ బాబు సినిమాలను ఆదర్శంగా తీసుకొని ముందు ముందు మరి కొంతమంది ఆగ్ర హీరోలు నటించిన సినిమాలు కూడా ఈ విధంగా స్పెషల్ షో ద్వారా ప్రదర్శించబడతాయనడంలో ఏమాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus