పాపం కంగనా ఇలా ఇరుక్కుపోయిందేమిటి…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్… ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. ఈ క్రమంలో వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలా ఎక్కువగా ఈ బ్యూటీ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇప్పటికే అనేక సార్లు బాలీవుడ్ స్టార్ హీరోల పై ఈమె చేసిన కామెంట్స్ వల్ల ట్రోలింగ్ గురయ్యింది. అందుకే ఈమెను ఫైర్ బ్రాండ్ అని కొంతమంది .. ‘బోల్డ్ బ్యూటీ’ అని మరికొంత మంది అంటుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ పై కేసు నమోదు కావడంతో కలకలం రేగింది.

ఇటీవల కంగనా… తన సోదరి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ కు మద్దతు పలుకుతూ కామెంట్ చెయ్యడం వల్ల.. కంగనా పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే…కంగనా సోదరి రంగోలి చందేల్ ఓ కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి టెర్రిరిస్టులు అంటూ కామెంట్ చేసింది. ఇలా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ట్వీట్ లు చేయడం… తగదని వెంటనే ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను తొలగించాలని అని ముంబైకి చెందిన అడ్వకేట్ అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ ఫిర్యాదు చేశారు.

రంగోలి చేసిన కామెంట్స్… మారణహోమం, హింసను సృష్టించేలా ఉన్నాయని వాటికి.. కంగనా మద్దతు తెలపడం కూడా దేశ వ్యాప్తంగా నిరసనలకు అలగే వివాదానికి దారి తీసిందని… అందుకే ఇలా కేసు పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus