Mahalakshmi , Ravinder: మళ్ళీ చిక్కుల్లో చిక్కుకున్న ట్రోలింగ్ జంట!

ట్రోలింగ్ జంట అయిన రవీందర్, మహాలక్ష్మీ అందరికీ సుపరిచితమే. తాజాగా ఈ జంట చిక్కుల్లో చిక్కుకుంది. రవీంద్ర ‘లిబ్రా ప్రొడక్షన్’ అనే బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే ఇతను ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకుని చీట్ చేసినట్టు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇలా అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఎన్నారై అయిన విజయ్ అనే వ్యక్తితో.. రవీందర్‌కు క్లబ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది.

అటు తర్వాత రవీందర్ నిర్మించే సినిమాలో భాగస్వామిగా కూడా వ్యవహరించాడు.ఈ క్రమంలో ఓ హీరోకి అడ్వాన్స్ ఇవ్వాలని రవీందర్.. విజయ్ ను రూ.20 లక్షలు అడిగాడట. అయితే విజయ్ రూ. 15 లక్షలు రెండు విడతలుగా ఇచ్చాడట. అయితే సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా రవీందర్.. విజయ్ కి ఇవ్వాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో .. ఇలా పోలీసులను ఆశ్రయించినట్లు స్పష్టమవుతుంది. ‘నా డబ్బులు అడిగితే రవీందర్‌ నన్ను బూతులు తిట్టేవాడు, ఇప్పుడు నా ఫోన్‌ నంబర్‌ కూడా బ్లాక్‌ చేశాడు.

‘ అంటూ కంప్లైంట్ లో పేర్కొన్నాడు విజయ్. మొత్తానికి రవీందర్ దిగొచ్చి.. విజయ్ కి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తానని, కేసు వాపసు తీసుకోవాలని కోరాడట. అయినా డబ్బులు తిరిగి విజయ్ కి చెల్లించకపోవడంతో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.దీంతో పోలీసులు కూడా రవీందర్‌పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. విజయ్ కి చెల్లించాల్సిన డబ్బు డబ్బులు తిరిగి ఇవ్వని పక్షంలో (Ravinder) రవీందర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్ణింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus