MAA Elections: గెలుపు తర్వాత తొలి పొలిటికల్‌ ట్వీట్‌ ఆ పార్టీదే

కర్ణుడి చావుకు లక్ష కారణాలు అని చెబుతుంటారు మన పెద్దలు. దీని గురించి క్లారిటీ కోసం ఎదురుచూసిన మాకు ఇప్పుడు ప్రకాశ్‌ రాజ్‌ ఓటమి పెద్ద ఉదాహరణలా కనిపిస్తోంది అంటే నమ్ముతారా? సినిమా నటుల కష్టాలు బాగా తెలిసినవాళ్లకు ఓటు వేసి గెలిపిస్తారు. అలాంటి వ్యక్తి ప్రకాశ్‌రాజ్ అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే అతనిపై గతంలో ఉన్న చాలా ఆరోపణలు, వివాదాలు దెబ్బతీశాయి అని చెప్పొచ్చు. అది కాకుండా రాజకీయ నేపథ్యం కూడా దెబ్బ తీసిందా? ఆయన ఓటమి తర్వాత తెలంగాణ రాజకీయ వర్గాల నుండి వచ్చిన ఓ ట్వీట్‌ చూస్తే అదే అనిపిస్తోంది.

‘‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణుగారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది. ‘మా’ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. ‘మా’ ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికి అభినందనలు. భారత్ మాతాకి జై ’’ అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు.

నిజానికి ‘మా’ ఎన్నికల్లో సాధారణ రాజకీయాలకు తావు లేదు అని చాలా రోజుల నుండి సిని‘మా’ పెద్దలు అంటూనే ఉన్నారు. అయితే ప్రకాశ్‌రాజ్‌ ఎప్పటినుండో బీజేపీకి వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నారు. ప్రధానమంతి నరేంద్ర మోదీని విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో ఆయనను బీజేపీ శ్రేణులు విమర్శిస్తూనే ఉన్నాయి. అధ్యక్ష పదవి కోసం పోటీ పడి… నామినేషన్‌ వేసి, వెంటనే వెనక్కి తీసుకున్న సీవీఎల్‌ బీజేపీలోనివారే. మంచు విష్ణు బంధువు అయిన ఏపీ సీఎం జగన్‌ పార్టీ కూడా విష్ణుకు సపోర్టు చేసిందని అన్నారు.

ప్రభుత్వపరంగా సపోర్టు లేదని మంత్రి పేర్ని నాని చెప్పారు కానీ, బ్యాగ్రౌండ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ పని చేసిందనే వాదనలూ ఉన్నాయి. మంచు విష్ణు విజయం కోసం రథసారథిగా మారిన నరేశ్‌… బీజేపీలోనే ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ప్రకాశ్‌రాజ్‌ రాజకీయ భావజాలం, ఆలోచనలు ఆయనకు కలిగించాయి అని అర్థమవుతోంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus