Ponniyin Selvan 2 Trailer Review: ‘పొన్నియన్ సెల్వన్- 2’ ట్రైలర్.. మొదటి దానితో పోలిస్తే పర్వాలేదు

మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్…చిత్రం మొదటి భాగం ‘పీఎస్1’ పేరుతో గతేడాది సెప్టెంబర్‌ 30న విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మిగిలిన భాషల్లో కూడా హిట్ అనిపించుకుంది. 8 ఏళ్ళ తర్వాత మణిరత్నంకి ఈ చిత్రం రూపంలో ఓ భారీ హిట్టు లభించింది. అయితే మొదటి పార్ట్ తమిళ జనాలకు తప్ప మిగిలిన భాషల్లోని ప్రేక్షకులకు అంతగా అర్థం కాలేదనే కామెంట్లు వినిపించాయి.

అయితే అసలు కథంతా సెకండ్ పార్ట్ లోనే ఉందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. అయితే టెక్నికల్ గా మాత్రం ‘పీఎస్-1’ సూపర్. పైగా క్లైమాక్స్ ను ఎండ్ చేసిన తీరు బాగుంది. ఇక తాజాగా ‘పీఎస్-2’ ట్రైలర్ ను కమల్ హాసన్ లాంచ్ చేయడం జరిగింది. ఇక ‘పీఎస్2’ ట్రైలర్ 3 నిమిషాల 30 సెకన్ల పాటు ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ‘పీఎస్-2’ కూడా టెక్నికల్ గా రిచ్ గా ఉందని చెప్పవచ్చు.

పార్ట్ 1  (Ponniyin Selvan 2) లో మిస్ అయిన ఎమోషన్స్.. ఈ సినిమాలో ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది. ఫస్ట్ పార్ట్ లో జయం రవి, కార్తీ పాత్రలు చనిపోయాయేమో అన్నట్టు చూపించారు. కానీ వీళ్ళిద్దరూ బ్రతికే ఉన్నట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. అలాగే రెండో ఐశ్వర్యారాయ్ ఎవరు అనే సస్పెన్స్ ను మెయింటైన్ చేశారు. పార్ట్ 1 ట్రైలర్ కంటే ఇది కొంచెం బెటర్ గానే ఉందని చెప్పవచ్చు. ఏప్రిల్ 28న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus