4 దశాబ్దాలుగా ‘పొన్నియన్ సెల్వన్’ ను తెరకెక్కించాలని కలలు కంటూ చివరికి కోలీవుడ్ మిడ్ రేంజ్ హీరోలతో ఆ లోటుని తీర్చుకున్నారు మణిరత్నం. దీని మొదటి భాగాన్ని ‘పీఎస్-1’ గా సెప్టెంబర్ 30న విడుదల చేశారు.లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు కలిసి ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ ప్రాజెక్టుని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా నిర్మించారు. తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏకకాలంలో విడుదల అయ్యింది.
విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్‌రాజ్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉండడంతో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి.కానీ తెలుగులో ఈ చిత్రానికి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. అయితే ‘గాడ్ ఫాదర్’ ఎంట్రీతో ఈ మూవీ కలెక్షన్స్ బాగా తగ్గాయి.
అలా అని మొత్తం డౌన్ అయిపోలేదు. సైలెంట్ గా బ్రేక్ ఈవెన్ కి దగ్గరైపోయింది. ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
4.79 cr
సీడెడ్
0.84 cr
ఉత్తరాంధ్ర
0.76 cr
ఈస్ట్
0.57 cr
వెస్ట్
0.44 cr
గుంటూరు
0.51 cr
కృష్ణా
0.51 cr
నెల్లూరు
0.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
8.77 cr
‘పొన్నియన్ సెల్వన్ – 1’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.8.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 16 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.8.77 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.23 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.కొత్త సినిమాలు రిలీజ్ అయినా ఈ మూవీ స్టడీగా రాణించడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ ఆదివారం బాగా కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.