PS2: ఆ కారణాలతోనే ‘పీఎస్2’ వెనక్కి వెళ్ళనుందా..!

మణిరత్నం డ్రీం ప్రాజెక్టు అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం గతేడాది సెప్టెంబర్ 30న రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. రెండు భాగాలు కలుపుకుని రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తే.. మొదటి భాగమే రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.తెలుగులో ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది.. అయితే టెక్నికల్ గా ఈ మూవీ బాగుంది అని కొంతమంది చెప్పడంతో తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.

ఇక ‘పొన్నియన్ సెల్వన్ -1’ ను చూసిన వారంతా ‘పొన్నియన్ సెల్వన్ 2’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ‘పొన్నియన్ సెల్వన్ 2’ చిత్రాన్ని 2023, ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్టు టాక్ వినిపిస్తుంది.షూటింగ్ పూర్తయినప్పటికీ.. ఈ చిత్రం ప్యాచ్ వర్క్ కోసం మణిరత్నం ఎక్కువ టైం తీసుకుంటున్నారట. ‘పొన్నియన్ సెల్వన్-1’ హిట్ అవ్వడంతో ‘పీఎస్-2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాబట్టి ఎక్కడా రాజీ పడకుండా.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలని మణిరత్నం ఎక్కువ టైం తీసుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. పైగా తమిళంలో తప్ప ‘పీఎస్-1’ మిగిలిన భాషల్లో ‘కాంతార’ సినిమాలా భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది.అంతేకాదు రెహమాన్ సంగీతం అందించిన పాటలు కూడా మెప్పించలేకపోయాయి. ఈ కాంబోలో వచ్చిన సినిమాల్లో ఆడియో ఫెయిల్ అవ్వడం అనేది ‘పీఎస్ 1’ తోనే జరిగింది. అయితే ఇంతటి భారీ చిత్రాన్ని సమ్మర్ కు కాకుండా ఏ సీజన్లో రిలీజ్ చేస్తారో చూడాలి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus