టాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి, బాహుబలి2 సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలుగా తెరకెక్కగా పొన్నియన్ సెల్వన్1 తెలుగు రాష్ట్రాల్లోని భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ అవుతోంది. తమిళనాడులో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు.
పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే మాత్రం నిర్మాత దిల్ రాజు పంట పండినట్లేనని చెప్పవచ్చు. హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా బుకింగ్స్ బాగానే ఉన్నా సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన విధంగా లేకపోవడం గమనార్హం. ఏఎంబీ సినిమాస్ లో ఈ సినిమాకు సంబంధించి ఎనిమిది షోలు తెలుగు వెర్షన్ ప్రదర్శితం కానున్నాయి. వైజాగ్, విజయవాడలలో ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం.
సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మధ్యాహ్నం నుంచి ఈ సినిమాకు బుకింగ్స్ పెరిగే అవకాశం పెరిగింది. పొన్నియన్ సెల్వన్1 సినిమాపై ఒక విధంగా మణిరత్నం కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే మణిరత్నంకు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చెన్నైలో మాత్రం ఈ సినిమాకు ఫస్ట్ డే టికెట్లు దాదాపుగా బుకింగ్ అయ్యాయి. ముంబైలో కూడా పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ డే బుకింగ్స్ బాగానే ఉన్నాయి.
తమిళనాడులో తొలిరోజే ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. తక్కువ రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోవడం గమనార్హం. పొన్నియన్ సెల్వన్2 రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజు కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.