Dj Tillu 2: ‘డీజే టిల్లు 2’కి సిద్ధమైన సితార టీమ్‌!

టాలీవుడ్‌లో ‘డీజే టిల్లు’ అనే ఓ సినిమా వచ్చింది. కొత్త కుర్రాడు అదరగొట్టేశాడు… ‘డీజే టిల్లు’ సినిమా విడుదలైన తొలి రోజుల్లో పక్క ఇండస్ట్రీలో ఇదే టాక్‌. అప్పటికే సిద్ధు జొన్నలగడ్డ తెలుగులో తెలిసినా.. సరైన విజయం అందుకున్నది మాత్రం ఆ సినిమాతోనే. టిల్లు క్యారెక్టరైజేషన్‌, సినిమా స్క్రీన్‌ప్లే అదిరిపోయాయి. దీంతో మరోసారి టిల్లు వచ్చినా చూసేందుకు ప్రేక్షకులు రెడీ అయ్యారు. అలాంటి వారి కోసం గుడ్‌ న్యూస్‌. ‘డీజే టిల్లు 2’ రావడానికి రంగం సిద్ధమైంది.

‘డీజే టిల్లు’ నిర్మాత నాగవంశీ ఈ రోజు ఓ ట్వీట్‌ చేశాడు. మా నిర్మాణ సంస్థలోని ఫ్రాంచైజీ సినిమాకి సీక్వెల్ తీస్తున్నాం అని చెప్పారు. ‘మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్రాంఛైజీ రౌండ్‌ 2 పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రేజీ అడ్వెంచర్‌ షూటింగ్‌ ఆగస్టు నుండి మొదలవుతుంది’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ మాటకే ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ అని చెప్పేయాలా అంటారా. ఆయన ఒక్కరి మాట పట్టుకుని ఈ మాట చెప్పడం లేదు. మరో నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి చేసిన ట్వీటే నాగవంశీ ట్వీట్‌ను డీకోడ్‌ చేసింది.

సినిమా ప్రకటించినందుకు అభినందనలు తెలుపుతూ సిద్ధు జొన్నలగడ్డ ను మెన్షన్‌ చేశారు మధుర శ్రీధర్‌ రెడ్డి. దీంతో క్లారిటీ వచ్చినట్లయింది. ‘ఏం చెప్పన్రా మార్కస్‌.. ఒక ల్యాండ్‌ ఉన్నది.. అది మన సొంతము.. మన పర్సనలు అనుకున్నా నేను. కాకపోతే ఊళ్లో వాళ్ల అందరి పేరు మీద ఉన్నది..’ అంటూ టిల్లు చెప్పిన డైలాగ్‌లు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో మారుమోగుతున్నాయి. ఇప్పుడు ‘డీజే టిల్లు 2’లో ఇంకేం చేస్తాడో, ఇంకేం చెప్తాడో మన టిల్లు.

‘డిజే టిల్లు’ సినిమాకు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. విమల్‌తో కలిసి సిద్ధు కూడా స్క్రిప్ట్‌ వర్క్‌ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమాలో నేహా శెట్టి తన అందంతో అదరగొట్టింది. ప్రిన్స్‌, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్‌ కూడా సూపర్‌ అనిపించారు. మరి రెండో పార్టులో ఎవరుంటారో చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus