పూజా హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించింది. ‘అరవింద సమేత’ ‘మహర్షి’ ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ హిట్లు ఈమె ఖాతాలో ఉన్నాయి.2022 వరకు భారీ పారితోషికం డిమాండ్ చేసింది. కానీ తర్వాత ఈమెను వరుస ప్లాపులు పలకరించాయి. దీంతో ‘గుంటూరు కారం’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాల నుండి ఈమెను తప్పించారు.
దీంతో పూజాకి తెలుగులో ఛాన్సులు రాలేదు. అయితే తమిళం, హిందీ భాషల్లో పెద్ద ప్రాజెక్టులు చేస్తుంది. కానీ అక్కడ కూడా సక్సెస్ లు రావడం లేదు. ప్రస్తుతం విజయ్ ‘జన నాయకుడు’, సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈమెకు తెలుగులో కూడా ఓ ఛాన్స్ లభించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతూ ఓ సినిమా రూపొందుతోంది. దుల్కర్ సల్మాన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన వచ్చింది. యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఇందులో ఓ హీరోగా నటించబోతున్నట్టు టాక్ నడుస్తుంది. ‘కాంతా’ ‘ఆకాశంలో ఒక తారా’ సినిమాలు కంప్లీట్ అయ్యాక.. దుల్కర్ ఈ ప్రాజెక్టుకి డేట్స్ ఇస్తాడు.