పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన పూజా హెగ్డే..

పూజా హెగ్డే.. నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’, ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తారక్, బన్నీ, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడిన పూజా పాప ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’ మూవీస్ బాక్సాఫీస్ బరిలో చతికిల పడ్డాయి కానీ పూజా పాపకి ఆఫర్స్ మాత్రం తగ్గలేదు.

మొన్నటివరకు గోల్డెన్ లెగ్ అన్నవాళ్లే.. వరుసగా మూడు ఫ్లాపులు పడేసరికి ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ చెయ్యడం స్టార్ట్ చేశారు. కానీ అమ్మడు అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అక్టోబర్ 16న బెంగుళూరులో పూజా హెగ్డే అన్నయ్య రిషబ్ హెగ్డే ఎంగేజ్ మెంట్ శివానితో గ్రాండ్ గా జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కలిసి పూజా సందడిగా గడిపింది. పూజా అన్నయ్య రిషబ్ హెగ్డే డాక్టర్.. ఆర్థోపెడిక్ సర్జన్ గా వర్క్ చేస్తున్నాడు.

‘‘అన్నయ్యకి ఎంగేజ్ మెంట్ అయింది.. త్వరలో పెళ్లికాబోతుందనే విషయాన్ని నేనింకా ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాను’’ అంటూ ఎంగేజ్ మెంట్ పిక్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఎమోషనల్ మూమెంట్ ని అందరితో షేర్ చేసుకుంది పూజా.. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత.. దాదాపు 11 సంవత్సరాలకి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా పాపని హీరోయిన్ గా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

పూజాకి ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ ఫిలిం.. అలాగే ‘మహర్షి’ తర్వాత మహేష్ బాబుతో రెండో సినిమా కావడం విశేషం. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus