‘అరవింద సమేత’లో సొంత వాయిస్ వినిపించనున్న పూజ హెగ్డే

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలకు తెలుగు పేర్లను పెట్టడమే కాదు.. తెలుగు యొక్క మాధుర్యాన్ని తన డైలాగుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా తన చిత్రాల్లో నటించే హీరోయిన్స్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేలా స్ఫూర్తినిస్తున్నారు. “అ..ఆ” సినిమాతో అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె మాతృభాష మలయాళం అయినప్పటికీ.. త్రివిక్రమ్ ప్రోత్సాహంతో తెలుగు నేర్చుకొని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని అభినందనలు అందుకుంది. అలాగే అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్, అను ఇమ్యానుయేల్ కూడా సొంత గొంతు వినిపించారు. ఇప్పుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే తో పాటు ఈషా రెబ్బా నటిస్తోంది.

ఈషా రెబ్బ హైదరాబాద్ అమ్మాయి కాబట్టి ఆమె సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇక కన్నడ మాతృభాష అయిన పూజ హెగ్డే తొలిసారి ఈ చిత్రంలో తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఆ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికపై పూజా హెగ్డే ఆనందంతో అభిమానులతో చెప్పుకుంది. ఇప్పటి వరకు అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ సొంత వాయిస్ తో ఎన్ని మార్కులు అందుకుంటుందో చూడాలి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus