స్టార్ హీరోల సినిమాలో నటిస్తే చాలు.. ఏ నటి కెరీర్ కు అయినా బూస్టింగ్ అందుతుందని ఎక్స్‌ట్రా మైలేజీ అందుతుందని అంతా అనుకుంటారు. కానీ ఇప్పుడలా వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు.స్టార్ హీరోల సినిమాల్లో రొమాంటిక్ సీన్లకు, పాటల్లో డాన్స్ లకు మాత్రమే హీరోయిన్లు అంకితం అన్న సంగతి తెలిసిందే. అయినా రష్మిక, పూజా హెగ్డే లకు ‘దీంతో సంబంధం ఏంటి.. వాళ్ళు ఆల్రెడీ స్టార్ హీరోయిన్లు అయిపోయారు కదా?’ అని మీరు అనుకోవచ్చు.
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది వీళ్ళ కోలీవుడ్ కెరీర్ గురించి.! పూజా హెగ్డే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందే తమిళ సినిమాతో..! జీవా హీరోగా నటించిన ‘మాస్క్'(ముగమూడి తమిళ్) అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. కానీ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది.మిస్కిన్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక.. మళ్ళీ ‘బీస్ట్’ అనే చిత్రంతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే.’డాక్టర్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నెల్సన్ దర్శకుడు.
కానీ ఈ మూవీ కూడా ఆమెకు సక్సెస్ ను అందించలేకపోయింది. ప్రస్తుతం ఈమెకు తమిళం నుండి అంతగా ఆఫర్లు రావడం లేదు. ఇక ఇప్పుడు రష్మిక వంతు. రష్మిక కూడా ఆల్రెడీ కార్తి నటించిన ‘సుల్తాన్’ మూవీతో తమిళంలో అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా జస్ట్ యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందుకుంది. రష్మిక నటన కూడా తమిళ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంది లేదు. అయితే ఈసారి దిల్ రాజు నిర్మిస్తున్న వరిసు (తెలుగులో వారసుడు) తో తమిళ ప్రేక్షకులను పలకరించబోతుంది రష్మిక.
విజయ్ ఈ చిత్రంలో హీరో..!హైప్ అయితే భారీగానే ఉంది.2023 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో అయినా రష్మిక తమిళంలో క్లిక్ అవుతుందా? అక్కడ అనుష్క, సమంత, తమన్నా.. మాదిరి స్టార్ హీరోయిన్ అవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!