నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే (Pooja Hegde). ఆ తర్వాత వరుణ్ తేజ్ (Varun Tej) ‘ముకుంద’ (Mukunda) లో కూడా నటించింది. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఈమెకు హృతిక్ రోషన్ (Hrithik Roshan) సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. కానీ అది పెద్ద డిజాస్టర్ అవ్వడంతో.. ఈమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. తర్వాత ఆమెకు అవకాశాలు కూడా కరువయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో ‘దువ్వాడ జగన్నాథం’ (Duvvada Jagannadham) తో దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) పూజా హెగ్డేకి మంచి బ్రేక్ ఇచ్చాడు.
ఆ తర్వాత ఆమెకు వరుసగా ఛాన్సులు లభించాయి. ‘మహర్షి’ (Maharshi) ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramulo) సినిమాలు బాగా ఆడటంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతలా బిజీగా ఉన్నప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘గద్దలకొండ గణేష్’ (Gaddalakonda Ganesh) లో నటించింది పూజా హెగ్డే. కారణం ఒకటి తనకి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ అయితే, ఇంకోటి కోటిన్నర పైగా ఆఫర్ చేసిన పారితోషికం అని చెప్పాలి.
ఇక ఆ తర్వాత పెద్ద సినిమాల్లో, ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది పూజా. ఈ క్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో (Ustaad Bhagat Singh) కూడా ఈమెకు ఛాన్స్ వచ్చింది. కానీ అనుకున్న టైంకి ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడం వల్ల.. ‘ఆ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు’ తన టీమ్ తో దర్శకుడికి, నిర్మాతలకి చెప్పేసింది. దీంతో వాళ్ళు శ్రీలీలని (Sreeleela) హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.
అటు తర్వాత పూజ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆమె డిమాండ్ కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం ఆమె తమిళంలో విజయ్ (Vijay Thalapathy), సూర్య (Suriya) వంటి హీరోలతో సినిమాలు చేస్తోంది. కానీ తెలుగులో మాత్రం ఈమె ఖాతాలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వదులుకున్నందుకు తన టీం వద్ద చెప్పుకుని చాలా ఫీల్ అవుతుందట పూజా హెగ్డే.