Pooja Hegde: నీటిలో మొసలిలా పూజా హెగ్డే పరిస్థితి.. ఎందుకంటే?

పాన్‌ ఇండియా హీరోయిన్‌ అంటూ ఈ మధ్య కాలంలో పూజా హెగ్డేను తెగ పొగిడేస్తున్న అభిమానులు. కారణం ఆమె ఏ కాలంలో తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించడమే. అయితే మన బుట్టబొమ్మకు తెలుగు తప్ప ఇంకే ఇండస్ట్రీ వర్కవుట్‌ కావడం లేదా? ఆఖరి పాన్‌ ఇండియా రూపంలో ఇతర ఇండస్ట్రీలకు సినిమా వెళ్లినా పరాజయాలే ఎదురువుతున్నాయా? అవుననే అంటున్నాయి ఆమె రీసెంట్‌ సినిమాల ఫలితాలు. మొన్నటికి మొన్న పాన్‌ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్‌’ బోల్తా కొట్టింది.

Click Here To Watch NOW

ఆ దెబ్బ నుండి కోలుకుంటుండగా… ‘బీస్ట్‌’ దెబ్బేసింది. దీంతో బుట్టబొమ్మా… నువ్వు తెలుగు దాటి వెళ్లొద్దమ్మా అని ఫ్యాన్స్‌ అంటున్నారట. తమిళంలో ‘మూగముడి’ సినిమాతో కెరీర్‌ ప్రారంభించింది పూజా హెగ్డే. ఆ సినిమా పరాజయం పాలైంది. తెలగులో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ సినిమాలు చేసింది. రెండూ ఫర్వాలేదనిపించాయి. అయతే ఉన్నట్లుండి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. హృతిక్‌ రోషన్‌తో ‘మొహంజదారో’ చేసింది. ఆ సినిమా దారుణ పరాజయం పాలైంది. దీంతో తిరిగి సౌత్‌కి వచ్చేసింది.

తెలుగులో ‘దువ్వాడ జగన్నాథం’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దల కొండ గణేష్‌’, ‘అల వైకుంఠపురములో’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ అంటూ వరుస హిట్లు కొట్టింది. మధ్యలో ‘హౌస్‌ఫుల్‌ 4’ అంటూ బాలీవుడ్‌ వెళ్లింది. పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఇక రీసెంట్‌ ఫామ్‌ చూస్తే ‘రాధేశ్యామ్‌’ వచ్చింది… వచ్చినట్లుగానే వెనక్కి వెళ్లిపోయింది. ‘బీస్ట్‌’ వచ్చింది.. సేమ్‌ సీన్‌. దీంతో పూజా హెగ్డేను అందరూ నీటిలో మొసలిలా పోలుస్తున్నారు. మొసలి పూజా అయితే.. నీరు టాలీవుడ్‌ అన్నమాట. కేవలం ఇక్కడ ఉంటేనే ఆమెకు హిట్లు. అలా కాకుండా పక్క వుడ్స్‌లోకి ఏ రూపంలో వెళ్లినా ఫ్లాప్‌లు తప్పవు అంటున్నారు.

ఈ విషయంలో నిజమో కాదు తెలియాలంటే ‘ఆచార్య’ సినిమా రావాల్సిందే. ఆ సినిమా హిట్‌ అయితే ‘నీటిలో మొసలి’ కామెంట్‌ కరెక్ట్‌ అయ్యినట్లే. అయితే పూజ నెక్స్ట్‌ సినిమా ‘సర్కస్‌’లో రణ్‌వీర్‌ సింగ్‌ సరసన నటిస్తోంది. ఆ సినిమా విజయం సాధిస్తే అపవాదు నుండి తప్పించుకోవచ్చు. కెరీర్‌ను బలంగా బిల్డ్‌ చేసుకోవచ్చు. ఈలోపు తెలుగులో మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా, పవన్ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ సినిమాలు చేస్తుంది. సో బుట్టబొమ్మా… కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus