Pooja Hegde: స్టార్ హీరోయిన్ ఆశలన్నీ ‘ఆచార్య’పైనే!

పూజాహెగ్డే కెరీర్ ఆరంభంలో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ వంటి సినిమాల్లో నటించింది. ఇవి నిరాశ పరిచినా.. ఆ తరువాత పెద్ద సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. కానీ వేరే భాషల్లో మాత్రం ఆమెకి సరైన సక్సెస్ లు లేవు. హిందీలో ఆమె చేసిన ‘మొహంజదారో’, ‘హౌస్ ఫుల్ 4’ డిజాస్టర్లుగా మిగిలాయి. తమిళంలో కెరీర్ ఆరంభంలోనే ‘మాస్క్’ అనే సినిమా చేసింది పూజ. అప్పటికి తెలుగులో కూడా నటించలేదు.

Click Here To Watch NOW

జీవా హీరోగా నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. పూజలను ఎవరూ గుర్తించనే లేదప్పుడు. ఆ తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా ఫ్లాపులే ఎదురయ్యాయి. ఆ తరువాత బాలీవుడ్ లో నటిస్తే అక్కడ కూడా డిజాస్టర్ తప్పలేదు. తిరిగి ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తే ఆ సినిమా మోస్తరుగానే ఆడినా.. పూజాకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘అల.. వైకుంఠపురములో’ లాంటి ఘన విజయాలతో పూజా టాప్ రేంజ్ కి వెళ్లిపోయింది. గత నెలలో ‘రాధేశ్యామ్’తో చేదు అనుభవం ఎదుర్కొంది పూజా. రీసెంట్ గా విడుదలైన ‘బీస్ట్’ సినిమాలో కూడా పూజానే హీరోయిన్. ఈ సినిమా కూడా వర్కవుట్ అవ్వలేదు. నిజానికి ఈ సినిమా ట్రైలర్ చూసినపుడే పూజాకు ఇందులో ఏమాత్రం రోల్ ఉందో అని సందేహించారు. సినిమా విడుదలైన తరువాత పూజాకు ఇందులో ఏమాత్రం ప్రాధాన్యం లేదని అర్ధమైంది.

మొత్తానికి వరుసగా రెండు ఫ్లాప్ లు అందుకుంది ఈ స్టార్ హీరోయిన్. ఇప్పుడు ఆమె నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఆమె పూర్తి స్థాయి హీరోయిన్ రోల్ కానప్పటికీ సినిమాను మాత్రం బాగా ప్రమోట్ చేస్తుంది. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus