Pooja Hegde Remuneration: మహేష్ ప్రాజెక్ట్ కోసం బుట్టబొమ్మ షాకింగ్ రెమ్యునరేషన్!

గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా గుర్తింపు అందుకుంటున్న పూజ హెగ్డే మరొక బిగ్ బడ్జెట్ సినిమాలో అవకాశం అందుకుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా నేడు అధికారికంగా లాంచ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆమెను మేయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటారు అని ఎవరూ ఊహించలేదు. ఇప్పటికే రెండుసార్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అరవింద సమేత తర్వాత అల వైకుంఠపురం సినిమాలో నటించింది.

Click Here To Watch

ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక మహేష్ బాబు తో కూడా మహర్షి సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడోసారి కూడా సెలెక్ట్ చేసుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది. అంతే కాకుండా ఈ సినిమా కోసం భారీ స్థాయిలో పారితోషికం కూడా ఇస్తున్నారట. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద సినిమాల్లో నటిస్తోంది.

వాటిలో ఏ సినిమా సక్సెస్ అయినా కూడా కూడా బాక్సాఫీసు వద్ద తన రేంజ్ మరింత పెరుగుతుంది అని చెప్పవచ్చు. అందుకోసమే ఈ బ్యూటీకి మహేష్ సినిమా కోసం సెలక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక రెండు కోట్లకు పైగా రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూజ అయితే పాన్ ఇండియా సినిమాలకు మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ హీరోగా చేస్తున్న బీస్ట్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.

ఆ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ప్రభాస్ తో చేసిన సినిమా మరి కొన్ని రోజులలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus