అస్సలు తగ్గేదే లేదంటున్న పూజా హెగ్డే….!

పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అల్లు అర్జున్ -త్రివిక్రమ్ ల.. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’ చిత్రంలోనూ… అలాగే అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పూజాకు బాలీవుడ్ మరియు కోలీవుడ్ నుండీ కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

ఈ క్రమంలో ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెంచేసిందని వినికిడి. ఇప్పటి వరకూ 2 కోట్లు పారితోషికం తీసుకుంటూ వచ్చిన పూజా ఇప్పుడు 3 కోట్లు డిమాండ్ చేస్తుందట. టాలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోల సినిమాల కోసం పూజా హెగ్డే ను సంప్రదించారట. కానీ రెమ్యూనరేషన్ 3 కోట్ల కంటే తక్కువ కావడం వలన రిజెక్ట్ చేసిందట పూజా హెగ్డే.

ప్రస్తుతం కరోనా వల్ల నిర్మాతలు చాలా నష్టపోయిన క్రమంలో చాలా మంది నటీ నటులు పారితోషికాలను తగ్గించుకోవడానికి ముందుకు వస్తున్న తరుణంలో పూజ మాత్రం ఎక్కువ పారితోషికం అడగడం పై ఆ టాప్ హీరోలు కూడా గుర్రుగా ఉన్నట్టు టాక్. మొన్నటికి మొన్న నితిన్ సినిమాని కూడా ఈమె రిజెక్ట్ చేసింది అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus