Pooja Hegde: మహేష్ తో షూటింగ్ కి రెడీ!

ఇదివరకు మహేష్ బాబుతో కలిసి ‘మహర్షి’ సినిమాలో నటించిన పూజాహెగ్డే ఇప్పుడు మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం దుబాయ్ లో సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు పూజాహెగ్డే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు.

ఆమె కారణంగానే సెకండ్ షెడ్యూల్ ఆలస్యమవుతుందనే ప్రచారం జరిగింది. మొదట ప్రాజెక్ట్ ఒప్పుకున్న పూజ ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందని.. ఆ కారణంగానే నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకాలేదని వార్తలొచ్చాయి. ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఇప్పుడు షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అయింది పూజాహెగ్డే. వచ్చే వారం నుంచి సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట. పూజాహెగ్డే డిసెంబర్ 15 నుంచి షూటింగ్ లో జాయిన్ కానుంది.

ఆల్రెడీ దర్శకనిర్మాతలకు డేట్స్ విషయంలో కన్ఫర్మేషన్ కూడా ఇచ్చిందట పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ బ్యూటీ ముంబైలో ‘సర్కస్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. త్వరలోనే హైదరాబాద్ రానుంది. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా విషయానికొస్తే.. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో పూజాతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని సమాచారం.

ఆ పాత్రలో శ్రీలీల కనిపించనుందని టాక్. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus