ప్రభాస్ సినిమా కోసం పూజ హెగ్డే చేతికి హిందీ స్క్రిప్ట్

ఏంటిది? ప్రభాస్ సినిమా కోసం పూజ హెగ్డే చేతికి హిందీ స్క్రిప్ట్ రావడమేంటి? అని ప్రతి ఒక్కరికీ అనుమానం కలగక మానదు. ఆ తర్వాత ప్రభాస్ హిందీ సినిమా చేస్తున్నారా? లేకుంటే.. బాలీవుడ్ హీరో పేరు రాయబోయి ప్రభాస్ పేరు రాశారా? అని ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ సందేహాలను కాసేపు పక్కన పెట్టి.. ఈ వార్త చదివితే మీకు పూర్తిగా విషయం ఏమిటో అర్థమయిపోతుంది. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేత వీర రాఘవ సినిమాని కంప్లీట్ చేసిన పూజ .. హిందీ సినిమా ‘హౌస్‌ఫుల్‌-4’లో నటిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి ప్రభాస్ 20 వ చిత్రంలో జాయిన్ అయింది. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఇటలీలో తొలి షెడ్యూల్ జరుగుతోంది. అక్కడ పూజ ల్యాండ్ కాగానే డైరక్టర్ ప్రభాస్ మూవీ స్క్రిప్ట్ చేతిలో పెట్టారంట. తెలుగులో ఉంటుందని ఓపెన్ చేయగానే అది హిందీలో ఉందంట. పూజా కథని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి ఈ స్క్రిప్ట్ ని రాసి ఇచ్చినట్లు తెలిసింది. ఇలా పక్కా ప్రణాళికతో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 1970 నాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus