Trivikram: త్రివిక్రమ్ కొత్త సినిమాలో ఆ హీరోయిన్ ఉండబోతుందా!

పూజా హెగ్డే నటించిన బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కస్, కిసీకాభాయ్ కిసీకాజాన్ లాంటి సినిమాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. అప్పటివరకు గోల్డెన్ గర్ల్ గా ఉన్న పూజా ఐరన్ లెగ్ గా మారిపోయింది. ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి పోటీపడినవారంతా ఇప్పుడు వద్దు అంటున్నారు. వరుసగా రెండు సంవత్సరాల్లో గట్టి ఆడిన సినిమా ఏదీ లేకుండా పోయింది. పూజా హెగ్డే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లది సూపర్ హిట్ కాంబినేషన్.

త్రివిక్రమ్ (Trivikram) తీసిన ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘అల వైకుంఠపురములో’ సినిమాల్లో పూజ నటించారు. నిజం చెప్పాలంటే… వాళ్ళ కలయికలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ హ్యాట్రిక్ సినిమా! అయితే, కొన్ని కారణాల ఆ సినిమాలో ఇప్పుడు పూజా హెగ్డే లేరు. అందులో నుంచి తప్పుకున్నారు. ‘గుంటూరు కారం’లో బుట్ట బొమ్మ ప్రత్యేక గీతం చేస్తున్నారని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని తెలిసింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… త్రివిక్రమ్, పూజా హెగ్డే కలయికలో మరో సినిమా రానుంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే…

గా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రమిది. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకుడు. త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారట.

పూజా హెగ్డే.. ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో మంచి పేరు తెచ్చుకుని తెలుగులో టాప్ హిరోయిన్ల లిస్ట్లోకి చేరిపోయింది. ఇక 2014లో వచ్చిన ‘ముకుందా’ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో నటించి తెలుగు ఆడియెన్స్కు మరింత దగ్గరైంది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడుకి వరుసగా సినిమా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. అలా ఈ బుట్టబొమ్మ.. ‘అలా వైకుంఠపురం’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘మహర్షి’, ‘గద్దల కొండ గణేష్’ వంటి సినిమాల్లో నటించి.. మంచి మార్కులు కొట్టేసింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus