Poonam Kaur: ఆ హీరోను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ సెన్సేషనల్ పోస్ట్!

ప్రముఖ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ పెట్టినా ఒకింత సంచలనం అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోను, ఒక స్టార్ డైరెక్టర్ ను ప్రధానంగా పూనమ్ కౌర్ టార్గెట్ చేస్తారని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. పూనమ్ కౌర్ తాజాగా “ప్రతి ఒక్కరికీ కూతురు ముఖ్యమే” అంటూ ట్వీట్ చేయడం జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరో కూతుళ్లతో కలిసి తిరుమలకు వెళ్లిన నేపథ్యంలో పూనమ్ కౌర్ సెటైరికల్ గా ఈ ట్వీట్ చేశారు.

Poonam Kaur

పూనమ్ కౌర్ అకస్మాత్తుగా ఆ స్టార్ హీరోను మళ్లీ టార్గెట్ చేయడం గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) పేరును ప్రస్తావిస్తూ పూనమ్ కౌర్ కొన్ని ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. పూనమ్ కౌర్ తనకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడాలని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. పూనమ్ కౌర్ ఈ వివాదం విషయంలో నాన్చివేత ధోరణిని వదిలిపెడితే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమా రంగానికి కూడా దూరంగా ఉన్నారు. ఆమె ఏం చెప్పినా సినీ కెరీర్ కు వచ్చే ఇబ్బంది లేదు. తరచూ వివాదాస్పద స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం భవిష్యత్తులో ఆమెకు మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. పూనమ్ కౌర్ కెరీర్ పరంగా బిజీ అయితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

పూనమ్ కౌర్ కెరీర్ పరంతా తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడాలని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా ఏ ట్వీట్ చేసినా ఆ ట్వీట్ సంచలనం అవుతోంది. పూనమ్ కౌర్ నెగిటివిటీకి దూరంగా ఉండాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

నా స్నేహితుల్లో అలాంటివారు లేరని చెప్పిన శోభిత.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus