సీనియర్ హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్స్ ఎప్పుడూ సంచలనమే. ఆమె పరోక్షంగా ఓ స్టార్ హీరో, స్టార్ దర్శకుడిపై సెటైర్లు వేస్తుంటుంది అనేది అందరికీ తెలిసిన సంగతే. అంతేకాకుండా కొన్ని సోషల్ ఇష్యూస్ పై కూడా స్పందిస్తూ ఉంటుంది. అది పక్కన పెడితే.. ఇటీవల ఆమె చేసిన కొన్ని ట్వీట్స్ పై పొలిటికల్ సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పూనమ్ ఓ పొలిటికల్ పార్టీలో చేరబోతుందని, ఆ పార్టీకి అనుకూలమైన ట్వీట్స్ చేస్తోందని చర్చలు మొదలయ్యాయి. వీటి జోరు మరింత పెరగడంతో స్వయంగా పూనమ్ కౌర్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
ఈ విషయం పై హీరోయిన్ పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ” ఇందులో ఎలాంటి నిజం లేదు.ఇప్పటివరకు నేను ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. ఏ పార్టీకి సంబంధించిన కండువా కూడా కప్పుకోలేదు.నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నేను ఏ రాజకీయ పార్టీ తరఫున పనిచేయడం లేదు. కానీ కొందరు రాజకీయ నాయకులు వారి స్వప్రయోజనాలు కోసం నన్ను ఓ పావుగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. గత ఎన్నికల్లో ఇలాంటి వికృత చేష్టలు చేశారు.. మేము చూశాము.
ఒక మహిళపై ఇలాంటి కుట్రలు చేయడం అనేది చాలా తప్పు. దయచేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను లాగొద్దు. ఇప్పుడు నేను చేనేత, మహిళా హక్కుల కోసం చేస్తున్న ఉద్యమాలను జాతీయ స్థాయికి తీసుకెళ్ళే విధంగా ప్రయత్నిస్తున్నాను. నిజంగా నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంటే.. స్వయంగా నేనే ప్రకటిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.