ఈ మధ్య కాలంలో వరుసగా సినీ ప్రముఖులు మరణిస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం.కొంతమంది సీనియర్ ఆర్టిస్ట్ లు,అలాగే ఇంకా కొన్ని విభాగాలకు చెందిన టెక్నీషియన్లు,నిర్మాతలు,నటులు వంటి వారు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంతేకాదు హీరోలు, హీరోయిన్ల కుటుంబంలో కూడా మరణ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మీనా భర్త, రాధిక శరత్ కుమార్ మాజీ భర్త, అర్జున్ తల్లి, నోయల్ తండ్రి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉందని చెప్పాలి.
ఈ మధ్యనే బాలీవుడ్ కు చెందిన కమెడియన్ దీపేష్ భన్ కూడా క్రికెట్ ఆడుతూ మరణించిన సంగతి తెలిసిందే.టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్,మలయాళం,పంజాబీ, మరాఠీ… ఇలా అనేక భాషల్లో చెందిన సినీ ప్రముఖులు మరణించడం మనం చూశాం. ఇటీవల ఒకరిద్దరు ఫ్యాషన్ డిజైనర్లు కూడా మరణించడం మనం చూశాం. నినన్నే మలయాళం నటుడు శరత్ చంద్రన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆయన సొంత నివాసంలోనే శరత్ మరణించడం మనం చూశాం.
ఆ విషాద ఛాయలు గడవకముందే గుజరాతీ నటుడు రసిక్ దవే కన్నుమూశారు.కొద్దిరోజులుగా ఆయన మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నాడని తెలుస్తుంది. గత 2 సంవత్సరాలుగా డయాలసిస్ చేయిస్తున్నారట కుటుంబ సభ్యులు.అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆయన భార్య మరియు ప్రముఖ నటి అయిన కేత్కి దవే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈమె ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’లో దక్ష విరాణి పాత్రతో మంచి పేరు సంపాదించుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె రిద్ధి దవే, కుమారుడు అభిషేక్.