సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఈ మధ్య తరచూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇలా ఎవరొకరు మృతి చెందుతూనే ఉన్నారు. ఇటీవల మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, క్యాన్సర్ తో ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, తేనెటీగా రామారావు వంటి వారు మరరించిన సంగతి తెలిసిందే. ఈ విషాదాల నుండి ఇండస్ట్రీ ఇంకా కోలుకోక ముందే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
ఓటీటీ ద్వారా పాపులర్ అయిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ మరణించడం ఇప్పుడు అందరికీ షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. నెట్ ఫ్లిక్స్ లో ‘సింటోనియా’ అనే వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. దీని ద్వారా పాపులర్ అయ్యింది బ్రెజిలియన్ చైల్డ్ ఆర్టిస్ట్ మిలెనా బ్రాండావో (Milena Brandao). అయితే ఈ పాప ఇప్పుడు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈమె వయసు కేవలం 11 ఏళ్ళు. అంతుచిక్కని ఒక వ్యాధి కారణంగా ఈమె చనిపోయినట్లు సమాచారం.
కొన్నాళ్లుగా ఈమె అలసట, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతూ ఆమె తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. అయితే ఈమెకు ఏ వ్యాధి సోకింది అనేది వైద్యులు గుర్తించలేకపోయారు అని తెలుస్తుంది. తర్వాత కొద్ది రోజులకే ఆమె మరణించింది. ఇక 2019 నుండి ‘సింటోనియా’ వెబ్ సిరీస్ మొదలైంది. దాదాపు 5 సీజన్ల వరకు ప్రసారం అయ్యింది. వీటన్నిటిలోనూ మిలెనా బ్రాండావో (Milena Brandao) నటించి పాపులర్ అయ్యింది.