ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ అలియాస్ కేకే (53) కన్నుమూశారు. కోల్‌కతాలోని హోటల్‌లో ఉన్న నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చిన తర్వాత హోటల్‌కు చేరుకున్న కేకే… ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే సీఎంఆర్‌ఐ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే కేకే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక్కసారిగా మూగబోయింది. కేకే బాలీవుడ్, టాలీవుడ్‌తోపాటు ఇతర పరిశ్రమల్లోనూ పాటలు పాడారు. దిల్లీలో సెటిలైన మలయాళీ దంపతులకు 1968లో జన్మించారు కేకే.
దిల్లీలోనే చదువుకున్న కేకే కెరీర్ కోసం ముంబయికి మకాం మారారు. కొన్ని వేల ప్రకటనలకు జింగిల్స్ పాడారు. ఆ సమయంలోనే ఏఆర్ రెహమాన్‌తో పరిచయం ఏర్పడింది. కేకే టాలెంట్‌ను గుర్తించిన రెహమాన్ తన సినిమాలో గాయకుడిగా అతడికి అవకాశాలిచ్చారు. అలా 1999లో ‘పాల్’ సినిమాతో గాయకుడిగా పరిచయమయ్యారు. సినిమాల్లోకి ప్రవేశించిన కేకే ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మేటి నేపథ్య గాయకుల్లో ఒకడిగా తనదైన ముద్ర వేశారు కేకే.
హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లో కేకే తన గానమాధుర్యాన్ని పంచారు. ఒకానొక సమయంలో కేకే పాట పాడితే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అలా తెలుగులో స్టార్ హీరోల చిత్రాలతోపాటు, చిన్న సినిమాల్లోనూ కేకే పాటలు పాడారు. ఈ క్రమంలో కేకేను తెలుగువాడే అని అనుకునేవారట చాలామంది. ఆయన పాటలో అంత స్పష్టత ఉండేది మరి. ‘‘కేకే పాటలు అన్నిరకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి.
అన్ని వయసుల వారిని అలరిస్తాయి. ఆ పాటలతో కేకేను ఎప్పటికీ గుర్తించుకుంటాం. కేకే కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెట్లరు, సెలబ్రిటీలు చాలామంది కేకే కోసం తమ సంతాప సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వి మిస్ యూ కేకే.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!