విలన్ ను పెళ్లి చేసుకోబోతున్న సింగర్..!

కరోనా హడావిడి మరింత ఎక్కువైనప్పటికీ కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లిళ్లకు రెడీ అయిపోతున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పటికే హీరో నిఖిల్, నితిన్ పెళ్లి చేసుకున్నారు. నిర్మాత దిల్ రాజు(రెండో పెళ్లి) అలాగే ‘రంగస్థలం’ ఫేం మహేష్ ఆచంట వంటి వారు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రానా కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. మెగా డాటర్ నిహారిక కూడా ఎంగేజ్ మెంట్ కు రెడీ అవుతుంది. ఈమె పెళ్లి డిసెంబర్ లో ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉంటే.. తాజాగా.. టాలీవుడ్ విలన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘జిల్’ చిత్రంతో విలన్ గా పరిచయమైన కభీర్ సింగ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇతను తరువాత ‘స్పీడున్నోడు’ ‘సుప్రీమ్’ ‘కిక్ 2’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘జెస్సీ’ వంటి చిత్రాల్లో కూడా విలన్ గా నటించాడు.ఇది పక్కన పెడితే.. పంజాబీ పాపులర్ సింగర్ అయిన డాలీ సింధు ని వివాహం చేసుకోవడానికి కూడా కభీర్ సింగ్ రెడీ అవుతున్నాడు.

గతేడాది చివర్లోనే వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యింది. ఈ ఏడాది సమ్మర్ లో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అది కుదరలేదు. అయితే ఇప్పుడు వరుసగా పెళ్లిల్లు జరుగుతున్న నేపధ్యంలో వీళ్ళు కూడా పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తుంది.

1

2

3

4

5


Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus