పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రైటర్ గా కెరీర్ ను ప్రారంభించిన పోసాని అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకుని బిజీ రైటర్ అయిపోయారు. ఈయన కథలు కూడా ఈయన మాటల్లానే విలక్షణంగా ఉండేవి. అంతర్లీనంగా ఓ మెసేజ్ కూడా ఉండటం వాటి ప్రత్యేకత. ఇప్పుడైతే పోసాని విలక్షణ నటుడిగా, కమెడియన్ గా సినిమాల్లో రాణిస్తున్నారు.రైటర్ గా అయితే ఆయన ఎప్పుడో ఫేడౌట్ అయిపోయారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆయన APFDC చైర్మన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఏపీఎస్ఎఫ్ఎల్ ఛానెల్ కు పోసాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇది కూడా ఓటీటీ లాంటిదే కానీ ప్రభుత్వ హయాంలో ఉంటుందట. రిలీజైన సినిమాలను పేమెంట్ పద్ధతిలో ఈ ఫ్లాట్ ఫాంపై ప్రదర్సించుకోవచ్చని తాజా సమావేశంలో చెప్పుకొచ్చారు.హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో.. నంది అవార్డుల గురించి పోసాని చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కొన్నేళ్లుగా నంది అవార్డ్స్ అనేవి ఇవ్వడం లేదు.
అప్పట్లో ఓ సారి ప్రకటించారు కానీ ఇచ్చింది లేదు. అప్పట్లో నంది అవార్డులను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకునేవారు తెలుగు సినిమా నటీనటులు. ఈ క్రమంలో పోసాని.. ‘నాకు ‘టెంపర్’ సినిమాకి నంది అవార్డు వచ్చింది. ఏదో ఫార్మాలిటీ కొద్దీ తప్పదు అన్నట్టు ప్రకటించారు. కానీ, నేను దాన్ని తిరస్కరించాను. నాకు అది కమ్మ అవార్డు లాగా అనిపించింది. అందుకే దాన్ని తిరిగిచ్చేశాను. నంది అవార్డుల అంశంలో సీఎం తో నే చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
అంటూ పోసాని (Posani) చెప్పుకొచ్చారు. వాస్తవానికి పోసాని కూడా కమ్మ వర్గానికి చెందిన వ్యక్తే. కానీ చంద్రబాబు పై ఉన్న కడుపుమంట వల్ల అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫ్రీ పబ్లిసిటీ చేస్తుండడం వల్ల ఆయన అలా మాట్లాడుతున్నారు. దీని పై పోసానికి గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. అయినా పోసాని వాటిని పట్టించుకోడు.పోసాని విమర్శలు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా పాంటించుకోలేరు అనేది వాస్తవం