‘కొన్ని సినిమాలు థియేటర్లో ఎందుకు ఆడతాయో తెలీదు.. ఇంకొన్ని సినిమాలు ఎందుకు ఆడవో తెలీదు’ అంటూ కొన్ని ప్లాప్ సినిమాలను ఓటీటీల్లోనూ, టీవీల్లోనూ చూసినప్పుడు జనాలు అనుకుంటారు. ఇప్పుడు ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా గురించి కూడా అలాగే అనుకుంటున్నారు. నితిన్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. ఇతనికి ఇదే మొదటి సినిమా.అయినా టీజర్, ట్రైలర్ లతో బాగా ఇంప్రెస్ చేశాడు.ఇక ‘రా రా రెడ్డి’ అనే పాట కూడా ఈ సినిమాపై హైప్ పెరగడానికి కారణమైంది.
ఆగష్టు 12న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే .. పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. కానీ రెండో రోజు నుండి సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయింది. క్రిటిక్స్ ఈ సినిమాని ఏకి పారేశారు. ఈ సినిమాకు వచ్చిన బ్యాడ్ టాక్ వల్ల ఓటీటీ ఆఫర్స్ కూడా వెనక్కి వెళ్లిపోయాయి. అందుకే డిజిటల్ రిలీజ్ చాలా ఆలస్యం అయ్యింది.
మొత్తానికి జీ5 వారు ‘మాచర్ల నియోజకవర్గం’ ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేశారు. వాళ్ళ పంట బాగానే పండినట్టు తాజా సమాచారం. డిసెంబర్ 9 నుండి జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. అయితే ఆల్రెడీ ఈ మూవీ 75 మిలియన్ మినిట్స్ ను రిజిస్టర్ చేసినట్లు జీ5 వారు ప్రకటించారు. సినిమా చూసిన నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.
ఇదే సినిమా పెద్ద హీరో కనుక చేసి ఉంటే సూపర్ గా ఉండేదని.. పులి ఫైట్, మాస్ సాంగ్, క్లైమాక్స్ వంటివి బాగున్నాయని చెబుతున్నారు. నిజంగా ‘మాచర్ల నియోజకవర్గం’ కనుక సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బెటర్ ఓపెనింగ్స్ ను రాబట్టేది అనేది వాస్తవం. కానీ పోటీగా ‘కార్తికేయ 2’ రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమాకి దెబ్బ పడింది.